మత్స్యకారులు తమ జీవినాన్ని ఎంత సాఫీగా సాగిస్తారో.. వేసవిని తలచుకుంటేనే భయం తో వణికి పోతుంటారు. ఆ రెండు నెలలూ రోజుకొక యుగంగా గడపాల్సిన దుస్థితి. దీనికి కారణం వేట నిషేధం. అటు చేపలు పట్టే వీలు లేక.. ఇటు ప్రభుత్వ సాయం అందక అష్టకష్టాలు పడేవారు.  పిల్లాపాపలతో పస్తులుండాల్సిన దుస్థితి దాపురించేది. వేట నిషేధం సమయంలో సకాలంలో ప్రభుత్వ సాయం అందక ఆకలితో అలమటించిన రోజులు అనేకం. అయితే ఈ పరిస్థితులు మారబోతున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

 

పాదయాత్రలో మత్స్యకారుల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆ కష్టాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని రెట్టింపు చేస్తూ రూ.10 వేల సాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు.

గతంలో అరకొర సాయం గతంలో మత్స్యకారులకు వేట నిషేదిత సమయంలో అరకొరగా సాయం చేసేవారు. నెలకు రూ.2 వేల చొప్పున రెండు నెలలకు ఇచ్చే నాలుగు వేలు కూడా సకాలంలో ఇచ్చేవారు కాదు.  ఈ సాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోదు.  ఒక్కో కుటుంబానికి 10వేల రూపాయలను అందజేయయాలని మత్స్యకారులు పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మేలు చేస్తానని మాట ఇచ్చారు.

 

 సీఎం అయిన ఆరు నెలల్లోనే మత్స్యకారులకు ఇచ్చిన హామీని వైయస్‌ జగన్‌ అమలు చేస్తూ..వేట నిషేధ సమయంలో నెలకు రూ.5 వేల చొప్పున రెండు నెలలకు రూ.10 వేల సాయం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈ నెల 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మత్స్యకారులకు సాయం అందజేయనున్నారు. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: