టీడీపీ అంటే కమ్మ పార్టీ...వైసీపీ అంటే రెడ్డి పార్టీ. ఇది ప్రతిఒక్కరు అనుకునే మాట. అలాగే గత కొన్ని దశాబ్దాలుగా ఏపీలో ఈ రెండు సామాజికవర్గాల మధ్యే అధికారం చేతులు మారుతూ ఉంది. అయితే ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధి పార్టీకి చెందిన సామాజికవర్గ నేతలని తమ పార్టీలోకి లాగేసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ...రెడ్డి నేతలని బాగానే లాగింది. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. జగన్ కూడా....కమ్మ సామాజికవర్గ నేతలని పార్టీలోకి తీసుకుంటున్నారు.

 

అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. జగన్ తెలుగుదేశం పార్టీని వీక్ చేయడానికి ఆ పార్టీకి మొదటి నుంచి అండగా ఉంటున్న కమ్మ నేతలని వైసీపీలో చేర్చుకుంటున్నారు. కాకపోతే  కమ్మ నేతలు వస్తే టీడీపీకి డ్యామేజ్ జరగొచ్చు. కానీ వైసీపీకి ఏ మేర లాభం ఉంటుందని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. పైగా మొన్నటివరకు టీడీపీలో ఉన్నవారు జగన్ పై ఏ విధంగా విమర్శలు చేశారో అందరికీ తెలుసు.  అయితే ఇప్పుడు వైసీపీలో చేరుతున్న క‌మ్మ నేత‌ల్లో చాలా మంది త‌మ అవ‌స‌రాల నేప‌థ్యంలో చేరుతున్న వారే అని చెప్ప‌డంలో ఎలాంటి డౌట్ లేదు.

 

సాధారణంగా చంద్రబాబు అయితే తనని దారుణంగా తిట్టిన నేతలని పార్టీలో చేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడరు. కానీ జగన్ మనస్తత్వం అలాంటిది కాదు. ఇలాంటి విషయాలు కఠినంగా ఉంటారు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో సాధారణ వైసీపీ కార్యకర్తలకు అర్ధం కావడం లేదు. సరే చేర్చుకుంటే చేర్చుకున్నారు. పోనీ వారిని పూర్తిగా నమ్మోచ్చ అంటే చెప్పలేం. 

 

ఎందుకంటే రేపు టీడీపీ అధికారంలో వస్తే అందులోకి వెళ్లరనే గ్యారెంటీ లేదు. సరే టీడీపీకి నాయకత్వం లేదు. భవిష్యత్తులో ఎన్టీఆర్ లాంటి వాడు పార్టీని నడిపిస్తే ఇప్పుడు వైసీపీలో ఉన్న కమ్మ నేతలు ఎంతమంది అటు వైపు వెళ్లకుండా ఉంటారు. ఇవన్నీ చూసుకుంటే వైసీపీలోకి వచ్చే కమ్మ నేతలతో జగన్ ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: