తెలుగుదేశం నేతలపై ఐటి దాడులు జరిగే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం దేశంలో ఐటి విభాగంగా అక్రమంగా ఆస్తులు సంపాదించిన రాజకీయ నాయకులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఇక కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత... డీకే శివకుమార్ పై కూడా ఐటి దాడులు జరిగాయి. ఇలా దేశ వ్యాప్తంగా ఐటి వేగం పెంచింది. సినీ రంగంపై దృష్టి పెట్టిన ఐటి అధికారులు... తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేసి వారి ఆస్తులకు సంబంధించిన వివరాలను, ఆదాయాలను ఆరా తీశారు.

 

ఇక బుధవారం ఉద‌యం నుంచే టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు లక్ష్యంగా ఈ దాడులు హైదరాబాద్ లో ఆయన నివాసంలో కార్యాలయాల్లో జరిగాయి. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీకి చెందిన నిర్మాత‌లు, హీరోల‌ను టార్గెట్గా చేసుకుని ఐటీ దుమ్ము దులుపుతోంది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుల మీద కూడా ఐటి విభాగం దృష్టి పెట్టె అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు పదవుల్లో కొందరు మంత్రులు... ఇష్టా రీతిన తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు, పనులు అప్పగించారని, వారికి సంబంధించిన జాబితా ఇప్పుడు కేంద్రం వద్ద ఉందని, త్వరలోనే వారిపై దాడులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

 

ముఖ్యంగా కొందరు మంత్రులు... తమ పలుకుబడితో ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలు చేశారని, తమ సంస్థలకు కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని ఐటి వద్ద సమాచారం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఒక కీలక నేతను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి గారి మీద కూడా ఐటి శాఖ దృష్టి పెట్టిందని, ఆయన వియ్యంకుడి మీద కూడా దృష్టి సారించిందని అంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: