ఇంగ్లీషు భాష ని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా  ఏమి  చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు’ జగన్ రెడ్డి గారు’ చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే... జగన్ రెడ్డి గారు.. ‘మా తెలుగు తల్లి’ అని పాడాల్సిన మీరు ’తెలుగు భాష తల్లినే’చంపేస్తున్నారు." జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇవి... పదే పదే జగన్ రెడ్డి గారూ అంటూ కులం పేరుని ప్రస్తావిస్తూ... ఇక ముఖ్యమంత్రి అనకుండా వైసీపీ నాయకుడు అంటూ ఆయన సంబోధిస్తున్న తీరు ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.

 

గత కొన్ని రోజులుగా పవన్ ఇదే విధంగా జగన్ రెడ్డి గారూ అంటూ సంబోధిస్తున్నారు. ఇప్పుడు దీని ఆధారంగా పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బలంగా ఉన్న తన సామాజిక వర్గాన్ని వైసీపీకి దూరం చేయడానికి, వైసీపీ తన కులాన్ని ప్రస్తావించే విధంగా పవన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీని వెనుక కొందరు పెద్ద తలకాయలు పవన్ ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న సందేహాలు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

సోషల్ మీడియాలో పదే పదే పవన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలను ఆయన అభిమానులు ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. తద్వారా రెడ్డి సామాజిక వర్గంతో విభేదాలకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని, అంతిమంగా ఇది టీడీపీకి మేలు చేకూర్చే ప్రయత్నమని అంటున్నారు. సామాజిక న్యాయం అని సినిమా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పుడు రాజకీయంగా బలహీనంగా ఉన్న టీడీపీ పవన్ ని ఈ విధంగా వాడుకోవాలని చూస్తుంది అంటూ మండిపడుతున్నారు. మ‌ళ్లీ బాబు గేమ్ ఉచ్చులో ప‌వ‌న్ ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇంకెన్నాళ్లు ఈ రాజకీయం పవన్ చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: