టీడీపీలో రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్ర‌బాబుకు పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నంద‌మూరి రామారావు కుటుంబానికి మ‌ధ్య గ్యాప్ ఉంద‌నే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వార్త‌ల‌కు, తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామానికి స‌మీక‌ర‌ణ‌లు రాజ‌కీయంగా ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే 2009లో నటుడు జూనియ‌ర్  ఎన్టీఆర్ ప్ర‌చారం తర్వాత టీడీపీకి, నంద‌మూరి ఫ్యామిలీకి మ‌ధ్య చాలా గ్యాప్ ఏర్ప‌డింది.

 

అయితే, నంద‌మూరి బాల‌య్య‌తో సంబంధం క‌లుపుకొన్న త‌ర్వాత క‌లిసినా.. రాజ‌కీయంగా మాత్రం దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ‌.. చంద్ర‌బాబుతో అంటీముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. 2014లో ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా నంద‌మూరి ఫ్యామిలీ పెద్ద‌గా యాక్టివ్‌గా లేదు. పైగా ఆ ఎన్నిక‌ల్లో నందమూరి ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టి.,. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పైనే చంద్ర‌బాబు ఆధార‌ప‌డ్డారు. దీనికి తోడు త‌న కుమారుడు నారా లోకేష్‌ను ప్ర‌భుత్వంలోకి తీసుకుని మంత్రి ప‌ద‌విని ఇచ్చారు. ఎమ్మెల్సీని చేసుకున్నారు.

 

ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ నంద‌మూరి ఫ్యామిలీని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్లారు చంద్ర‌బాబు దీంతో నంద‌మూరి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి మ‌ధ్య ఎలాంటి రాజ‌కీయ పొత్తు లేద‌నే ప్ర‌చారం జోరుగానే సాగింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు బద్నాం చేశార‌ని వ్యాఖ్యానించారు. అయితే, అనూహ్యంగా నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త నాయ‌కుడా అనే రేంజ్‌లో జ‌య‌కృష్ణ కుమారు డు చైత‌న్య కృష్ణ రంగంలోకి దిగారు.

 

ఇటీవ‌లి రాజ‌కీయ ప‌రిణామాలు, ముఖ్యంగా చంద్ర‌బాబును మంత్రి కొడాలి నాని, టీడీపీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీలు దూషించ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. వేలు చూపించి మ‌రీ మేన‌మామ‌ను ఏమైనా అంటే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. అంటే.. ప‌రోక్షంగా నంద‌మూరి ఫ్యామిలీ ఎప్పుడూ.. నారా కుటుంబానికి అండ‌గా ఉంటుంద‌నే సంకేతాలు వెలువ‌రించిన‌ట్ట‌యింది. అయితే, ఇదంతా కూడా వ్యూహాత్మ‌కంగా జ‌రిగింద‌నే వ్యాఖ్య‌లు కూడా రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

 

బాబుకు సొంత వియ్యంకుడు బాల‌య్య ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆయ‌న ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని, రాజకీయంగా త‌న‌పైనా విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న భావించి ఉంటార‌ని, అందుకే చైతన్య కృష్ణను రంగంలోకి దింపి ఉంటార‌ని అంటున్నారు మొత్తానికి చైత‌న్య కృష్ణ విడుద‌ల చేసిన సెల్ఫీ వీడియో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగానే ఉన్నా.. మున్ముందు ప‌రిణామాల్లో ఈయ‌న కీల‌కంఎలా అవుతారు ?  బాబు కానిస్తారా? అనే సందేహాలు మాత్రం అలానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: