ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు అంశం తెర మీదకు వచ్చింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజధాని మార్పు తధ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిని  చంద్రబాబు నాయుడు సరిగ్గా నిర్మించలేదని  రాజధాని నిర్మాణం లో తప్పులు ఉన్నాయి అంటూ... అందుకే రాష్ట్ర రాజధాని మార్పు చేపడుతున్నామని  మంత్రి బొత్స వ్యాఖ్యానించటం  ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే ఏపీ రాజధాని మార్పు నిర్ణయం  జగన్ సర్కార్ కి తీసుకోవడంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ఏపీ రాజధాని మార్పు పై నిర్ణయం హేయమైన  చర్య అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధాని మార్పు వల్ల ప్రజాధనం వృధా అవుతుంది అంటూ ఆరోపించాయి . 

 

 

 

 అయితే తాజాగా ఏపీ రాజధాని మార్పు పై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజధాని ప్రజలకు అందుబాటులో అన్ని కార్యాలయాకు  అనువుగా ఎక్కడైతే ఉంటుందో అని తెలిపెందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిందని  ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి  రాష్ట్ర రాజధాని ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందని నివేదిక అందిస్తారని తెలిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మాత్రం ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఏపీ రాజధాని అమరావతి మార్పు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిని  పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 

 

 

 

 రాజధాని నిర్మాణం అత్యావశ్యకం అని  చంద్రబాబు అన్నారు . ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా  నిర్మించిన అమరావతిని జగన్ అడ్రస్ లేకుండా చేస్తున్నారంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి అంటూ ఆయన ఆరోపించారు. ఒకవేళ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కొనసాగిస్తే లక్ష కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వచ్చేదని  చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని మార్పు విషయంలో జగన్  కమిటీలు ఎందుకు వేస్తున్నారు అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. రాజధాని అభివృద్ధి జరుపుతున్న సింగపూర్ లాంటి దేశాలను  అన్ని పెట్టుబడులను ఉపసంహరించుకునేల  చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు ఇంకెవరు పెడతారూ  అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ఇసుక కొరత అలాగే ఉందని ఆరోపించిన చంద్రబాబు..  ఇసుక కొరత సమస్యను పరిష్కరించకుండా ఇసుక వారోత్సవాలు నిర్వహించినంత  మాత్రాన ఫలితం ఉండదు అని  వ్యాఖ్యానించారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: