ఆంధ్ర ప్రదేశ్ అంటేనే ప్రశాంతతకు మారుపేరు. ఏపీలో ప్రతి ఒక్కరూ అన్న దమ్ములుగా ఉంటాయి. ఇక్కడ కులాలు ఎన్నో ఉన్నాయి. మతాలు కూడా అనేకం ఉన్నాయి. అయినా అంతా అన్నదమ్ములుగానే మెలుగుతారు ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఏపీ లాంటి చోట కొన్ని పార్టీలు కాలూనకపోవడానికి కూడా ఈ మతపరమైన సహనం, సామరస్యమే ప్రధాన కారణం.

 

మరి ఏపీలో మత సంఘర్షణలు జరుగుతాయని సాక్ష్త్యాత్తూ  మైనారిటీ వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఆంజాద్ భాషా ఆరోపించారు. అయన ఈ రోజు  ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలుగుదేశం పార్టీ మత ఘర్షణలకు తెరలేపాలనుకుంటోందని ఆరోపించారు. ఈ విక్రుత రాజకీయ క్రీడకు కొన్ని మీడియా సంస్థలు కూడా మద్దతుగా నిలవడం బాధాకరమని అంజాద్ భాషా అంటున్నారు.

 

జగన్ సర్కార్ జెరూసలెం వెళ్ళే క్రైస్తవ యాత్రికులకు డబ్బుని పెంచడంపైన వస్తున్న ఆరోపణలను ఆయన  ఖండించారు. ఇది మంత్రి వర్గ సమావేశాల్లో  ఎపుడో తీసుకున్న నిర్ణయమని, ఇపుడు వాటికి సంబంధించి జీవోలు ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా  విడుదల అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఇది ఒక్క జగన్ సర్కారే కాదు కొన్ని దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నవేనని పేర్కొన్నారు. ఇక వీటిని పట్టుకుని మత గొడవలకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నించడం దారుణమని అన్నారు.

 

ఇక ఏపీలో జగన్ సర్కార్ అన్ని హామీలను నెరవేరుస్తూ కుల మతాలకు అతీతంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. అయితే దీన్ని చూసి ఓర్వలేకనే  టీడీపీ కొన్ని శక్తులతో కలసి అల్లర్లకు తెర తీయాలనుకుంటోందని భాషా ఆరోపించారు. ప్రజలు ఈ మతాల మధ్య చిచ్చు పెడుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా భాషా కోరారు. మొత్తానికి సడెన్ గా ఉప ముఖ్యమంత్రి భాషా ఈ ప్రకటన చేయడం బట్టి చూస్తూంటే ఏమైనా ఈ తరహా ఘటనలు జరుగుతాయని సర్కార్ వద్ద  ఏమైనా సమాచారం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

 

మరి అప్పట్లో ఏపీలో అలా జరుగుతుంది. ఇలా జరుగుతుంది చంద్రబాబుని అధికారంలో నుంచి దించేస్తారు, కూల్చేస్తారు అంటూ జోస్యాలు చెప్పిన ఆపరేషన్ గరుడ ఎక్కడ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గరుడకు ఒకవైపే కనిపిస్తుందా  మరో వైపు  చూడారా అని  కూడా సెటైర్లు పడుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: