ఇప్పటికే తమిళనాడులో మక్కల్ నీది మయ్యాం పేరుతో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించిన లోకనాయకుడు కమల్ హాసన్, అనంతరం తొలి విడతగా అక్కడి కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇక మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తాను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు గత ఏడాది ఆఖరి రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొద్ధి నెలలుగా ఆయన పార్టీ గుర్తు మరియు పేరు విషయమై వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి మరికొద్దిరోజుల్లో రజిని కూడా తన అధికారిక రాజకీయ పార్టీ పేరు మరియు గుర్తు అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత స్టార్ హీరోలు అయినప్పటికీ ఎవరికి వారు ప్రత్యేకంగా పొలిటికల్ పార్టీలు పెట్టి రాబోయే 2021 ఎన్నికలను టార్గెట్ చేసిన ఈ నటులు, అతి త్వరలో చేతులు కలుపబోతున్నట్లు తెలుస్తోంది. 

 

నిన్న ఒక ఫంక్షన్ నిమిత్తం తమిళనాడులో అక్కడి మీడియాతో మాట్లాడిన కమల్, తనకు మొదటి నుండి తన వంతుగా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఉండేదని, అయితే అది రాజకీయాల ద్వారా అయితే ఇంకొంత ఎక్కువగా వీలవుతుందని భావించి రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. అయితే కొన్నాళ్ల క్రితం రజిని పార్టీపై మరియు ఆయన అరంగేట్రం పై కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమల్, నేడు మాత్రం షాకింగ్ గా మాట్లాడారు. తనకు, తన పార్టీకి రాబోయే రోజుల్లో అవసరం అయితే సూపర్ స్టార్ రజిని గారి మద్దతు తీసుకోవడం జరుగుతుందని, ఏమో టైం కలిసి వస్తే ఆయనతో కలిసి నేను కూడా పోటీ చేయవచ్చు అంటూ చెప్పుకొచ్చారు కమల్. ఇప్పటికే తమిళ నాడులో డీఎంకే అధినేత కరుణానిధి

 

అన్నాడీఎంకే అధినేత జయలలిత మరణం తరువాత అక్కడి ప్రజల్లో ఆ రాజకీయ పార్టీపై కొంత నమ్మకం పోయినట్టు స్థానికి మీడియా వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా రాబోయే 2021 ఎన్నికల్లో రజిని, మరియు కమల్ కలిసి కనుక పోటీ చేస్తే మాత్రం వారిద్దరూ గెలుపొందడం ఖాయం అని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇదంతా ఒట్టి రాజకీయ ఎత్తుగడ అని, సీఎం సీటు కోసం ఆ ఇద్దరు హీరోలు వేస్తున్న సూపర్ స్కెచ్ అంటూ ప్రతిపక్షాల నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం తమిళ నాట ఎంతో వైరల్ అవుతోంది.... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: