తిరుపతి వెంకటేశ్వర స్వామిని చాలా పవర్ ఫుల్ గాడ్ అంటారు. ఆయనతో పరాచకాలు ఆడిన వారు తప్పకుండా తమ కర్మఫలం అనుభవిస్తారని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అంతటి శక్తివంతమైన దేవుడాయన. అయితే గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో తిరుపతి విషయంలోనూ అరాచకాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఇలాంటి విషయాలను రమణ దీక్షితులు పలుసార్లు వెల్లడించారు. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి.

 

తిరుపతి బాలాజీ స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకల్లో నగదు రూపంలో వచ్చేవి ఎక్కువ శాతం ఉంటాయి. కేవలం హుండీ ఆదాయమే రోజుకు రూ.80లక్షలు ఉంటుందని అంచనా. బ్రహ్మోత్సవాలు, పండుగ సమయాల్లో ఇది మరింత పెరిగి కోటి రూపాయిలకు పైనే ఉంటుంది. ఇక వసతి గదులు, ప్రసాద విక్రయాలు, ఇతర బ్యాంకుల్లో ఉన్న శ్రీవారి బంగారం, నగలపై వచ్చే వడ్డీ ఇతరత్రాలు కలిపి చూసినా స్వామి వారి ఆదాయం కోట్లలో ఉంటుంది.

 

అయితే ఈ స్వామి వారి నగదు అంతా గతంలో కేవలం ప్రభుత్వ బ్యాంకుల్లోనే జమ చేసేవారు. కానీ చంద్రబాబు హయాంలో తొలిసారిగా ఈ నగదులు ఇండస్ ఇండ్ అనే ప్రైవేటు బ్యాంకులో జమ చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు.. స్వామి వారి ఆదాయాన్ని ఇష్టానుసారం ఖర్చు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వెలుగు చూసిందేమింటంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీకి చెందిన రూ.4కోట్ల రూపాయిల నిధులను పార్టీ కార్యక్రమమైన తిరుపతి ధర్మపోరాట దీక్షకు వినియోగించారట.

 

ఈ విషయం తాజా విజిలెన్స్ కమీషన్ దర్యాప్తులో తేలింది. ఇదే విధంగా స్వామి వారి నగల ఆడిట్ కూడా నిర్వహించాలని కోరుకుంటున్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో శ్రీవారి సొమ్ములు ఉంచి తమకు ఇష్టం వచ్చిన రీతిలో నిధుల దుర్వినియోగం చేసే ఆస్కారం లేకుండా తాజాగా ప్రభుత్వ బ్యాంకుల్లోనే శ్రీవారి సొమ్ములను ఉంచేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: