ఒకప్పుడు చాణక్యుడిగా కీర్తింపబడ్డ చంద్రబాబు ఇప్పుడు వ్యూహరచనలో ఫెయిలవుతున్నారా.. జనం నాడి పట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నారా.. రాజకీయంగా స్వయంకృపరాధాలతో చిక్కుల్లో పడుతున్నారా.. అంటే అవునని ఆ పార్టీ నాయకులే అంటున్నారట. ఓవైపు అప్ డేట్ కాని లోకేశ్.. మరోవైపు వ్యూహాలు విఫలమవుతున్న చంద్రబాబు. వీరిని చూసి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జాలిపడుతున్నారట.

 

ఈ విషయం చెబుతున్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. లోకేష్‌ ఎప్పుడు అప్‌డెట్‌ కావడం లేదని... టీడీపీ పరిస్థితి చూసి ఎంపీలు, ఎమ్మెల్యేలు చంద్రబాబును తిడుతున్నారన్నారట. మొన్నటి వరకు ఇసుక అన్నాడు. ఆ తరువాత దాడులు అన్నారు. ఇప్పుడేమో ఆంగ్లమని కొత్త పల్లవి ఎత్తుకున్నారన్నారని మండిపడుతున్నారట. భాషాభివృద్ధికి కృషిన వారి పిల్లలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారని ఆ నాయకులే గుర్తు చేసుకుంటున్నారట.

 

అధికారంలో ఏమాత్రం పనికిరారని ప్రజలు తీర్పు ఇస్తే..ఇప్పుడు కరకట్టపై కూర్చొని ప్రజలు తననే కోరుకుంటున్నారని డేరా బాబ, కరకట్ట బాబా మాదిరిగా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అందరూ సమానమే అని, ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.

 

టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తే ప్రశ్నించకూడదా అని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి చట్టంలో అందరూ సమానమే అన్నారు. చంద్రబాబు తీరును గమనిస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనికి వస్తారా అని నిలదీశారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదన్నారు. కుటుంబ సభ్యులను హత్య చేస్తే కూడా వారికి క్షమాభిక్ష చేసిన గొప్ప కుటుంబం వైయస్‌ఆర్‌ది అన్నారు. అలాంటి కుటుంబంపై ఫ్యాక్షన్‌ ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. ప్రతి ఎలక్షన్‌లో వైయస్‌ఆర్‌ కుటుంబానికి వేల మెజారిటీ ఇస్తూ ఆదరిస్తుంటే..ఆ ప్రజల తీర్పును సహించలేక చంద్రబాబు దూషిస్తున్నారన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: