తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు తియ్యటి వార్త చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. తెలంగాణలో కార్మిక ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖలో 28 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ నిన్న (బుధవారం) ఉత్తర్వులు జారీచేసింది. 

 

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు అందులో పేర్కొన్నారు. అయితే ఇందులో కార్మిక శాఖలో 15, ఫ్యాక్టరీల డైరెక్టరేట్‌ పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి. భర్తీకి అనుమతించిన వాటిలో కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు ఏడు, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు 3, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 16, అసిస్టెంట్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టు ఒక్కటి ఉంది. 

 

కాగా ఇప్పటికే కేంద్రంలో, ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చెయ్యగా ఇప్పుడు తెలంగాణలోనూ తెలంగాణ ప్రజల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చెయ్యడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల సంఖ్య గమణియంగా తగ్గించాడు ఆంధ్ర యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 

         

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కలిపించాడు. ఇప్పటికే జనవరిలో మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చెయ్యనున్నారు. అయితే తెలంగాణాలో మాత్రం నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉంది. డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. 

         

మొన్నటికి మొన్న ఆర్టీసీ సమ్మో కారణంగా ఆర్టీసీ ఉద్యోగులను తీసేశాము అని.. ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని ప్రభుత్వం చెప్పినందుకు ఆ పోస్టుల కోసం ఆర్టీసీ డిపోల ముందు నిరుద్యోగులు క్యూ కట్టారు. ఆలా ఉంది ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: