కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా త్రికారువాకు చెందిన 105 సంవత్సరాల వయస్సు గల భగీరథి బామ్మకు చిన్నప్పటి నుండి చదువంటే అమితమైన ఇష్టం. కానీ చిన్న వయస్సులోనే భగీరథి బామ్మ కుటుంబ బాధ్యతలు మీద పడటంతో చదువుకు దూరం కావాల్సి వచ్చింది. చదువంటే ఎంతో ఇష్టపడే భగీరథి బామ్మ రెండు రోజుల క్రితం నాలుగవ తరగతి పరీక్ష రాశారు. కేరళ రాష్ట్రంలోని అక్ష్యరాస్యత మిషన్ ప్రోత్సాహంతో భగీరథి బామ్మ ఈ పరీక్ష రాశారు. 
 
భగీరథి బామ్మ తల్లి భగీరథి బామ్మ మూడవ తరగతి చదువుకునే సమయంలో కన్నుమూసింది. భగీరథి బామ్మ తన చెల్లెళ్లను, తమ్ముళ్లను పోషించటానికి ఎంతో ఇష్టమైన చదువుకు దూరమయ్యారు. కానీ చదువంటే ఇష్టం ఉంటే చదువుకు వయస్సు అడ్డు కాదని భగీరథి బామ్మ 105 సంవత్సరాల వయస్సులో నాలుగవ తరగతి పరీక్ష రాశారు. భగీరథి బామ్మ వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాల తరువాత భగీరథి బామ్మ భర్త మరణించాడు. 
 
భర్త చనిపోయే సమయానికి భగీరథి బామ్మకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఎంతో కష్టపడి భగీరథి బామ్మ తన పిల్లల్ని పెంచారు. 105 సంవత్సరాల వయస్సులో కూడా భగీరథి బామ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. భగీరథి బామ్మకు కంటిచూపు, వినికిడి సమస్యలు లేకపోవటం గమనార్హం. ఏ విషయాన్నైనా ఒక్కసారి వింటే మరిచిపోని జ్ఞాపకశక్తి భగీరథి బామ్మ సొంతం. 
 
భగీరథి బామ్మ కేరళలో కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ నిర్వహిస్తున్న అక్షర లక్ష్యం ప్రాజెక్టులో భాగంగా ఈ పరీక్షను రాశారు. 2018 సంవత్సరంలో కేరళలో 96 సంవత్సరాల వయస్సు గల కార్తియని పరీక్ష రాసి 100 మార్కులకు 98 మార్కులు సాధించింది. ప్రస్తుతం భగీరథి బామ్మ చిన్న కూతురు థాంకమణి వయస్సు 67 సంవత్సరాలు. 105 సంవత్సరాల వయస్సులో చదువుపై ఉన్న ఇష్టంతో నాలుగవ తరగతి పరీక్ష రాయటంతో నెటిజన్లు భగీరథి బామ్మను ప్రశంసిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: