కొందరికి వయస్సు మీరిన బుద్ది రాదు. పెద్దరికం వస్తుందన్న జ్ఞానం కూడా ఉండకుండా వెకిలి చేష్టలకు పాల్పడతారు. ఇలాంటి వారి బలహీనత గనుక సైబర్ నేరగాళ్లకు తెలిస్తే నిండా ముంచి గోదారిలో తేలేలా చేస్తారు. ఈ మధ్యకాలంలో స్వీట్ వాయిస్‌తో ఫోన్ చేసి తమ వలలో వేసుకుని ఉన్నదంతా ఊడ్చుకెళ్లే మూఠాలు తయారు అయ్యాయని ఎంతగా చెప్బుతున్నా వినకుండా కొందరు యువకులు, వయస్సు మళ్లిన వారు ఇలాంటి బారిన పడుతున్నారు.

 

 

ఇప్పుడొక వృద్ధుడు కూడా ఏకంగా 34 లక్షలు పోగొట్టుకుని లబోదిబో మంటున్నాడు. రిటైర్మెంట్ అయిన ఇతను హయిగా ఇంట్లో కూర్చుని కృష్ణరామా  అని జపం చేసుకోక ఆకాశానికి నిచ్చెనవేసి ఊరేగుదామని ప్రయత్నించి బోల్తా పడ్డాడు. ఇతను ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆడిన ఆటలో కీలు బొమ్మలా మారాడు. అది మాయ అని తెలియక సొమ్మంతా ఆ మాయలేడికి సమర్పించేసుకుని, చివరికి మోసపోయానంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. వివరాలు తెలుసుకుంటే..

 

 

సోమిర్ కుమార్ దాస్‌ అనే వ్యక్తి ఎంఎంటీఎస్‌లో పనిచేసి రిటైర్మెంట్ అయ్యాడు. ఇతనికి ఒకరోజు అన్నే రోజ్ అనే మహిళ ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి. విదేశాల్లో ఉంటానని పరిచయం చేసుకుంది. కొద్దికాలంలోనే చనువు పెరిగి.  ఆ పరిచయం ఆర్థిక విషయాలు మాట్లాడుకునే స్థాయికి వెళ్లింది. అవతల ఉన్నది సైబర్ నేరగాళ్లని తెలియక దాస్ అన్ని విషయాలు ఆమెతో పంచుకున్నారు. నమ్మకంగా మాట్లాడుతుండడంతో దాస్ ఆమె బుట్టలో పడిపోయాడు.

 

 

తాను రిటైర్ అయ్యానని చెప్పడంతో విదేశాల నుంచి గిఫ్ట్ పంపిస్తానని చెప్పింది. అలా చెప్పిన తరువాత  ఓ రోజు ఎయిర్‌పోర్టు నుంచి మీకు పెద్ద ఎత్తున ఫారిన్ కరెన్సీ వచ్చింది. అవి కావాలంటే కస్టమ్స్ డ్యూటీ కట్టాలని ఫోన్ కాల్ వచ్చింది.. పాపం ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని నమ్మిన దాస్ తన ఏడు ఖాతాల వివరాలు టపీమని చెప్పేశాడు. అలాగే ఆ ఖాతాల్లో ఉన్న రూ.34 లక్షలను వెంటనే ఆ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసేశాడు.

 

 

ఇక విదేశీ కరెన్సీ మొత్తం మనదేనని సంబరపడ్డాడు. ఆ అత్యాశే అతని కొంపముంచింది. రోజులు గడుస్తున్నాయి కాని ఎలాంటి స్పందన అటువైపునుండి లేకపోయే సరికి ఒకసారి తనకు వచ్చిన నంబర్‌కు కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. ఇంకేముంది,  ముసలి బుర్రలోని బల్బ్ వెలిగింది.

 

 

దాంతో తాను మోసపోయానని గ్రహించిన దాస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ పోలీసులు నిందితులను ట్రేస్ చేశారు. ఈ తతంగమంతా ఢిల్లీ నుంచి జరిగిందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఇద్దరు వ్యక్తులన అదుపులోకి తీసుకున్నారు. కానీ కేవలం రూ.2 లక్షలు మాత్రమే వారినుండి రికవరీ చేయగలిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: