ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలే  తెలంగాణలో కూడా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేసి నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థను కాపాడటం తో పాటు ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ సహా తమ న్యాయపరమైన 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. కాగా గత 47 రోజుల పాటు సమ్మె కొనసాగుతుండగా... ఆర్టీసీ కార్మికుల సమ్మె పై నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ఎలాంటి షరతులు  లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసింది. అయితే 47 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడం సంచలనం గా మారిపోయింది. 

 

 

 

 తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన పై పలు కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి . ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే తాము సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చేసిన  ప్రకటనతో కొంతమంది విభేదిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే 47రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు, తమకు న్యాయం జరగాలని ఆర్టీసీ కార్మికులు చేసుకున్న బలిదానాలకు అర్థం లేకుండా పోతుంది అంటున్నారు. షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటే ఆర్టీసి సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేయడం సరికాదంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ జేఏసీ తమకు న్యాయం చేస్తుందేమోనని 47 రోజులుగా సమ్మె  చేస్తున్న ఆర్టీసీ కార్మికుల నమ్మకాన్ని గాలికొదిలేసి కార్మికులను  నట్టేట ముంచారని ఆర్టీసీ జేఏసీ నాయకుల పైన మండిపడ్డారు.

 

 

 

 47రోజులు పాటు సమ్మె చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు కనీసం ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకుండా ఎలా సమ్మె విరమిస్తారు అంటూ  ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన  లేకుండానే  సమ్మె  విరమిస్తానని ప్రకటన చేయటం ఏంటని ప్రశ్నించారు  .సమ్మె చేస్తున్న కార్మికులు  సమ్మె విరమించి విధుల్లో చేరడానికి సిద్ధంగా లేరని... జెఎసి నేతలు మాత్రం ఆర్టీసీ కార్మికులు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు అని  తెలిపారు. సమ్మె కొనసాగింపుపై జేఏసీ 1 గురువారం సమావేశం అవుతుందని చెప్పారు. కాగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సమ్మె విరమించాలని అంటూ చేసిన ప్రకటనపై అటు కార్మికులను ప్రజలను భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులు సమ్మె చేసి ఆర్టీసీ జేఏసీ సాధించంది  ఆత్మబలిదానాలు కార్మికుల మనోవేదనా  అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విరమణ అంటూ ప్రకటన చేసిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి... ఆర్టీసీ కార్మికులు  ప్రశ్నలు వేస్తే ఏం సమాధానం చెబుతారు అన్న చర్చ కూడా ప్రస్తుతం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: