పవన్ కళ్యాణ్ తానేదో క్లీన్ పాలిటిక్స్ చేస్తానని మైక్ ముందుకు వస్తే చాలు ..ఫ్రీడమ్ ఫైటర్ మాదిరిగా సుద్దులు చెబుతారు. కానీ చేతల్లో ఇంకొకటి ఉంటుంది. ఏపీలో జగన్ మీద అయిన దానికి కాని దానికి ఒంటి కాలు మీదే లేచే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ మీద పోరాటం ఎందుకు చేయరు. పైగా ట్విట్టర్లో కేసీఆర్ అడుక్కోవటం .. ఇదే పవన్ నయా రాజకీయం. తెలంగాణలో ఉద్యమాలు చేస్తే ఏమౌతుందో పవన్ కు బాగా తెలుసు. కేసీఆర్ చుక్కలు చూపిస్తారు పీకేకి. అందుకే పవన్ గారు కెసిఆర్ ను తిట్టలేకపోతున్నారు. ఈ మేరకు సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి ప్రకటన చేసిన మరుక్షణమే పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ కు రిక్వెస్ట్ పంపారు.

 

దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు. పవన్ రాజకీయాలు తెలంగాణలో ఒక మాదిరిగా ..  ఏపీలో ఇంకో రకంగా అదే ఏపీలో అయితే జగన్ మట్టికొట్టుకుపోతావ్ .. జగన్ రెడ్డి అంటూ రెచ్చిపోతారు. ఈ తేడా ఎందుకో  ఏపీలో రాజకీయాలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతకీ ఆ రిక్వెస్ట్ లో పవన్ గారు ఏమన్నారంటే .. . ‘పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కేసీఆర్ గారికి విజ్ఝప్తి చేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మా ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులూ కోరారు. నలభై రోజులకి పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను.  ఇలా సాగింది పీకే గారి అభ్యర్ధన. 


అయితే తెలంగాణలో గత నెల రోజుల పైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే పీకే చేసేందేమీ లేదు. ట్విట్టర్లో కొన్ని రాతలు రాయటం తప్పితే. సమ్మె జరుగుతున్నంత కాలం దీనిపై పీకే  పెద్దగా స్పందించిన పరిస్థితి కనిపించలేదన్న విషయం తెలిసిందే. సమ్మెపై తెలంగాణ సర్కారు కఠిన వైఖరితో ముందుకు సాగుతున్న దరిమిలా... ఏ మాట అంటే... ఏం జరుగుతుందోనన్న భావనతోనే పవన్ నిన్నటిదాకా దీనిపై అంతగా స్పందించలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే సమ్మెపై కేసీఆర్ మరింత కఠినంగా వ్యవహరించడం ఆయన వైఖరిని హైకోర్టు కూడా తప్పుబట్టకపోవడంతో కార్మికులు సమ్మె విరమణ బాట పట్టక తప్పలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: