ఆకాశంనుంచి వాన కురుస్తుంది.. వడగళ్ల వాన కురుస్తుంది.  చేపల వానలు కురిసిన సందర్భాలు ఉన్నాయి... కప్పల వాన, సాలీడు పురుగుల వాన.. అంతెందుకు ఆవుల వాన కురిసిన సందర్భాలు ఉన్నాయి.  ఇలా ఎన్నో రకాల వానలు కురిసిన సంగతులు తెలుసు.  కానీ, ఎప్పుడైనా డబ్బుల వర్షం కురిసినట్టు విన్నారా.. ఎప్పుడైనా కన్నారా.  కనీసం అలాంటి సంఘటనలు మీకు ఎదురయ్యాయి.  


ఇప్పుడున్న సమయంలో రోడ్డుపై  పదిరూపాయలు దొరికితే వదిలిపెట్టం.  మరి వందలు వేలు దొరికితే వదులుతామా చెప్పండి.  అస్సలు వదలం కదా. కోల్కతాలో ఇటీవల  డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఓ సంస్థపై రైడ్ చేసింది. కోల్ కతా లోని ఎగుమతి దిగుమతుల సంస్థపై దాడులు చేసింది.  రెవిన్యూ అధికారులు దాడులు చేస్తున్నారని తెలుసుకున్న సిబ్బంది.. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల కట్టలను కిటికీలోపలి నుంచి బయటకు విసిరేశారు.  


ఆకాశంలో నుంచి డబ్బుల కట్టలు కింద పడటంతో.. అటుగా వెళ్తున్న ప్రజలు షాకయ్యారు.  దొరికిన డబ్బులను దొరికినట్టుగా పట్టుకుపోయారు.  డబ్బులు రోడ్డుపై దొరికితేనే వదలరు.  అలాంటిది గాల్లో నుంచి కిందకు పడితే వదులుతారో చెప్పండి.  ఒడిసిపట్టుకుని హ్యాపీగా తీసుకొని వెళ్తారు. అంతేకదా మరి.  డబ్బు ఎవరికీ చేదు చెప్పండి.  దొరికిన డబ్బును దొరికినట్టుగా పట్టుకొని ఎంచక్కా వెళ్ళిపోతారు.  


ప్రభుత్వానికి టాక్స్ కట్టమంటే కట్టకుండా తప్పించుకుంటూ.. రైడ్ చేస్తే ఇలా దాడులు చేయడం అన్నది మరీ దారుణమైన విషయంగా చెప్పాలి.  డబ్బులు వచ్చాయా లేదా అన్నది పక్కన పెడితే.. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో వందల మంది ట్యాక్స్ కట్టకుండా ఉంటున్నారు కాబట్టే ఇండియాలో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి.  పార్టీ ఒక్కరు కూడా ట్యాక్స్ కడితే.. ప్రభుత్వానికి తగినంత ఆదాయం వస్తుంది.  రేట్లు తగ్గుతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: