ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నారు . ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనకాడడం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పాలన పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా  ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్. పొరుగు రాష్ట్రాల ప్రజలు మాకు ఇలాంటి సీఎం కావాలి అంటూ నినదించే లా అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ పాలనను గాడిలో పెట్టిన జగన్  పాలన అంటే ఇలాగే ఉండాలి అంటూ నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన 5 నెలలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ప్రతి రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

 

 

 

 ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యను అందించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఇంగ్లీష్ మాధ్యమం వస్తేనే విద్యార్థులు మంచి ఉద్యోగాలను సాధించగలరు అని భావించి  జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు మాత్రం జగన్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  తెలుగును మసకబారేలా చేసేందుకే జగన్  ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. 

 

 

 

 కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి  అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా  వాటిని కొట్టి పారేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొదట ఒకటో తరగతి నుంచి 6వ  తరగతి వరకు ఇంగ్లీష్ మీడియా ని ప్రవేశపెట్టనుండ ఆ తర్వాత ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుతూ పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించారు.విద్యార్థులకు  ఇంగ్లీష్ మీడియం బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా జగన్ సర్కారు నిర్ణయించింది. అయితే ఉపాధ్యాయ పోస్టులకు మాత్రం జగన్ సర్కార్ ఆంక్షలు విధించింది. వచ్చే సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటుందని ఇప్పటికే 85వ జీవో జారీ చేసింది జగన్ సర్కార్. ఈ జీవో ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినప్పటికీ ఇంగ్లిష్ పరిజ్ఞానం లేక పోతే మాత్రం ఉపాధ్యాయ ఉద్యోగ పై ఆశ వదులుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు వేసవిలో ఇంగ్లీష్ లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించగా కొత్త గా నియమింపబడిన ఉపాధ్యాయులకు మాత్రం ఈ వెసులుబాటు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: