జగన్ ఏపీలో తిరుగులేని ఆధిక్యతతో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు 50 శాతం పైగా ఓట్ల షేర్ ఇది మామూలు విషయం కాదు. నిజంగా అద్భుతం. దేశంలోనే ఒక రేర్ ఫీట్. జగన్  గ్రాండ్ విక్టరీ రీసౌండ్ కి దేశం మొత్తం ఏపీ వైపు చూసింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం జగన్ని హత్తుకుని అభినందించారు. అలాంటి అజేయుడు జగన్ ఏపీలో ఆరు నెలల కాలంలోనే అన్ని రకాలుగా దూసుకుపోతున్నారు. 

 

ఏపీలో ప్రతీ పధకాన్ని అమలు చేస్తూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. జగన్ విషయంలో ఇలాగే వదిలేస్తే ఆయన  తనకు తానుగా చెప్పినట్లుగానే ముప్పయ్యేళ్ళ పాటు సీఎం గా ఉండిపోతారన్న బెంగ ఏపీలోని అన్ని పార్టీలో ఉంది. అందుకే టీడీపీ, జనసేన జగన్ ఏ తప్పు చేయకపోయినా ప్రతీ విషయం పైనా  నానా యాగీ చేస్తున్నారు. పవన్ అయితే ట్విట్టర్ అసలు  వదలడం లేదు. ఇక లోకేష్ సంగతి సరేసరి ట్విట్టర్ పిట్ట అయిపోయారు.

 

చంద్రబాబు చడీ చప్పుడూ ప్రతీ రోజూ  ఉండేదే. బాబు జగన్ విషయంలో మాట్లడకపోతే విశేషం. ఆయన తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఇవన్నీ సరే కానీ ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీకి జగన్ మీద ఎందుకు కోపం వచ్చింది. అసలు రావాల్సిన అవసరం ఉందా ఇవే ప్రశ్నలు అందరికీ వస్తున్నాయి.

 

జగన్ విజయం వెనక తమ సహకారం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారుట. మరి ఏ రకమైన సాయమో వారు బయటకు గట్టిగా  చెప్పలేకపోతున్నారు. అంటే ఒక విధంగా అనుకోవాలి. బాబు మీద కమలనాధులు దారుణంగా మాటల దాడి చేయడంతో బలమైన విపక్షంగా ఉన్న వైసీపీకి అది మరింత ప్లస్ అయిందట. ఈ విషయాన్ని మాజీ మంత్రి మాణిక్యాలలావు చెబుతున్నారు.

 

సరే జగన్ కి ప్లస్ అయింది. అదే సమయంలో  ఏపీలో విడిగా పోటీ చేసిన జనసేన నాయకుడు పవన్ కి ఎందుకు ప్లస్ అవలేదు. అంటే జగన్ బలమైన నాయకుడే కాదు, ప్రజా నాయకుడు కూడా. పైగా 2014లోనే అధికారంలోకి రావాల్సిన వాడు, కడపలో ఎంపీగా పోటీ చేస్తే రికార్డ్ స్థాయిలో మెజారిటీ వచ్చింది. మరి ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మావల్లే గెలిచాడు, మమ్మల్ని అసలు  ఖాతరు చేయడంలేదని బీజేపీ గుండెలు బాదుకోవడంలో అర్ధముందా. ఈ అవేదన కాస్తా ఆగ్రహంగా మారి ఇపుడు జగన్ మీద బీజేపీ కత్తులు దూస్తోందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: