మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.  ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని కలను సాకారం చేసుకోవాలని శివసేన చూస్తున్నది.  దానికి తగ్గట్టుగానే బీజేపీని పక్కన పెట్టి శత్రువులుగా భావించిన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సై అన్నది.  ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అంటోంది.  ఇదిలా ఉంటె, నిన్నటి రోజున కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  


శివసేన పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు శివసేనపై మండిపడ్డారు. ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.  పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్సీపీతో పొత్తుకు సిద్ధంగా లేకపోవడంతో ఆ పార్టీ ఆందోళన చెందుతున్నది.  పార్టీ అధినేత ఉద్దవ్ థాకరేతో మాట్లాడాలని అనుకున్నారు.  కానీ, వారికి అపాయింట్మెం ట్ ఇచ్చారో లేదో ఇంకా తెలియలేదు.  


మరోవైపు నిన్నటి రోజున శరద్ పవార్ ప్రధాని మోడీని కలిశారు.  మోడీని ఎందుకు కలిశారు అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. శరద్ పవార్ మోడీతో మీటింగ్ తరువాత శివసేనతో చర్చలు ఇంకా పూర్తి కాలేదని, చర్చలు జరుగున్నాయని అని మాత్రమే చెప్పారు.  అయితే, శివసేన మాత్రం త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటోంది.  


దీనిపై క్లారిటీ ఉందని, రెండున్నర సంవత్సరాలు శివసేన, మరో రెండున్నర సంవత్సరాలు ఎన్సీపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారని శివసేన చెప్తున్నది.  ఎన్సీపీ వెర్షన్ మరోలా ఉన్నది.  రెండు పార్టీలు చెప్తున్న వెర్షన్లు వేరుగా ఉండటంతో ఎలా ఏంటి అనే విషయాలు తెలియడం లేదు.  స్వీట్లు ఆర్డర్ ఇచ్చామని, త్వరలోనే స్వీట్స్ వస్తాయని, త్వరలోనే  అందరికి పంచుతామని అంటున్నారు. అయితే, 17 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుంటే.. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందో అర్ధం కావడం లేదు.  ఇటు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం కూడా ఇదే కావొచ్చు.  ఇప్పటికే బీజేపీకి 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నట్టుగా ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: