ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేంపార్టీకి చురుకైన,ఉత్సాహవంతమైన నాయకత్వం చాలా అవసరం... క్రింది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరందరిలోను ఆత్మస్థైర్యాన్ని నింపి,పార్టీ భవిష్యత్తు పట్ల భరోసా కలిగించే నాయకత్వం చాలా అత్యవసరం...ఇప్పటి వరకూ ఈ భాద్యత చంద్రబాబు నాయుడు సమర్దవంతంగా నిర్వహించారు... కొన్ని కారణాల వల్ల పూర్తి బాధ్యతను ఆయన ఒక్కరి మీదే కాక గత కొంతకాలంగా చిన్నబాబు కు కొన్నింటిని అప్పగించారు... అప్పటి నుంచి కూడా పార్టీలో రకరకాల అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పవచ్చు.

 

బయట వ్యక్తుల ప్రమేయం ఇక్కడి నుంచే మొదలు అయింది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలు చీలిపోయాయి... వైసీపీ నేతలు ఎన్నికలలో ఆ విషయాన్ని బలం గా వాడుకున్నారు... పార్టీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలు మూల కారణం అయ్యాయి...   మరి వీటన్నింటినీ చంద్రబాబు నాయుడు గ్రహించలేకపోయారా అన్నదే పార్టీ అభిమానులకు అర్దం కానిది... నాయకుల ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దీని వెనుక చినబాబు హస్తం ఉందనేది కార్యకర్తల ఆవేదన.

 

లోకేష్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా మంది సీనియ‌ర్ నేత‌ల‌ను సైతం చిన్న చూపు చూడ‌డంతో వాళ్లంతా ఇప్పుడు పార్టీ అధికారంలో లేక పోవ‌డంతో లోకేష్‌పై తీవ్రంగా విరుచుకు ప‌డుతున్నారు. లోకేష్ ప్రమేయం కారణంగా పార్టీ చాలా నష్టపోయిందని, ఆయన నాయకత్వ లక్షణాలు లేవని... పార్టీ ని ముందు ఉండి నడిపించే సామర్ధ్యం ఆయనలో లేదని ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు లోకేష్ మీద ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సరే అంతిమంగా పార్టీ నష్టపోతుందని.

 

అసలు ట్విట్టర్ లో లోకేష్ చేసే వ్యాఖ్యలు ఆయనే చేస్తున్నారా లేక మరెవరైనా చేస్తున్నారా ? అనే అనుమానం కూడా కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పార్టీకి పూర్వ వైభవం వచ్చే వరకు చంద్రబాబు లోకేష్ ని దూరం పెట్టాలని ఈ విషయం లోకేష్ కి అర్ధమయ్యేలా చెప్పాలని కోరుతున్నారు. బాబు లోకేష్ ఇలా ఎంక‌రేజ్ చేస్తూ పోతే పార్టీ భ‌విష్య‌త్తులో బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌ద‌ని కూడా సీనియ‌ర్ నాయ‌కులు మ‌ద‌న పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: