సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు కేసియార్ చుక్కులు చూపిస్తున్నారు. 48 రోజులు నిరవధికంగా సమ్మె చేసినా ఏమీ సాధించలేక యినియన్లు ఫెయిలైన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నిరోజులు సమ్మె చేసినా ఉపయోగం లేదని అర్ధమైపోవటంతో యూనియన్లు వేరేదారి లేక కేసియార్ తో కాళ్ళ బేరానికి దిగిపోయాయి.

 

సమ్మె విరమించుకుంటున్నామని తమను భేషరతుగా విధుల్లోకి చేర్చుకోవాలని యూనియన్ నేతలు చేస్తున్న విజ్ఞప్తిని కేసియార్  ఏమాత్రం లెక్క చేయటం లేదు. సిబ్బందిని  ఉద్యోగాల్లోకి చేర్చుకోవటానికి ప్రభుత్వం అనేక షరతులు విధించింది. విధుల్లో చేరిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ సమ్మె మాట ఎత్తమన్నది మొదటిది. సమ్మె కాలానికి జీతాలు చెల్లించేది లేదన్నది రెండోది. విలీనమని ఇతరత్రా డిమాండ్లు వినిపించకూడదన్నది మూడో షరతు.

 

అయితే ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం ప్రతీ సిబ్బంది విడివిడిగా అఫిడవిట్ ఇవ్వటం కుదరదని యూనియన్ నేతలంటున్నారు. తమను భేషరతుగానే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో కేసియార్ వాళ్ళ డిమాండ్ ను తోసిపుచ్చుతున్నారు. నిజానికి సమ్మె విరమించాలని నిర్ణయించుకోవటంతోనే యూనియన్ నేతలకు బార్గెయినింగ్ కెపాసిటి పోయిందన్నది వాస్తవం.

 

సమ్మె విరమించమని, విధుల్లోకి చేరమని కేసియార్ అడగలేదు. సమ్మె మొదలైపుడు కేసియార్ అడిగితే యూనియన్ నేతలు కాదు పొమ్మన్నారు. దాంతో కేసియార్ యూనియన్లతో చర్చలు జరిపేదే లేదు పొమ్మన్నారు. కేసియార్ చెప్పినపుడు సమ్మె విరమించకుండా ఇపుడు యూనియన్ నేతలు విరమిస్తున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్లను సిఎం పట్టించుకోవటం లేదు.

 

మరి విధుల్లో చేరే విషయంలో మొదలైన ప్రతిష్టంభన ఎప్పుడు తొలుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. భేషరతుగా అని యూనియన్ నేతలంటున్నారు. కాదు ప్రతి ఒక్కరూ అఫిడవిట్లు ఇవ్వాల్సిందే అని కేసియార్ తెగేసి చెప్పారు. దాంతో  ఈ విషయంలో కూడా మళ్ళీ యూనియన్ నేతలంతా సమ్మె అంటారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తం మీద యూనియన్ నేతలకు కేసియార్ చుక్కులు చూపిస్తున్నది మాత్రం నిజం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: