భారతదేశ ప్రజలు నిజంగా ఏంత అమాయకులని ప్రపంచ దేశాలు మనకోసం ఆలోచిస్తున్నాయట? మరి నిజంగానే మనదేశంలో అమాయకులు ఉన్నారా అంటే సమాధానం ఏం వస్తుందంటే మేమెందుకు అమాయకులం. ఏంచక్కా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు, ఇతరులను ముంచడం లాంటివి చేయడంలో ఫస్ట్ అని చెప్పుకుంటారేమో? ఇలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందాలా మనం ఇతరుల చేతిలో మోసపోతూ మనమే ఇతరులను మోసం చేస్తూన్నామనే భ్రమలో బ్రతుకుతున్నాం. ఇది సర్వేలో తేలిన నిజమంటా?

 

 

ఇక అసలు విషయం ఏంటంటే మొబైల్ యాడ్ మోసానికి బలైన దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందట.. నిజమే అనిపిస్తుంది కదండీ ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుదామని ఆలోచించే వారున్నప్పుడు మోసం చేసేవారు కూడా ఉంటారు అంటున్నారు జీవిత సత్యం గ్రహించిన వారు.

 

 

ఇక తమ ప్రకటనల బడ్జెట్‌లో దాదాపు 20 శాతం ప్రకటన మోసం కోసమే విక్రయదారులు ఖర్చు చేస్తున్నారని ఓ నివేదిక తెలిపింది. 10 మంది విక్రయదారులలో తొమ్మిది మంది మోస పూర్తి ప్రకటనలతోనే తమ వ్యాపారాన్ని సాగిస్తారని మొబైల్ మార్కెటింగ్ అసోసియేషన్ యాడ్ ఫ్రాడ్ బెంచ్మార్క్ రిపోర్ట్ లో తెలిపిందట. కుకీ స్టఫింగ్ (74 శాతం), యాడ్‌వేర్ ట్రాఫిక్ (65 శాతం), డేటా మోసం (61 శాతం) మరియు యాడ్ ఇంజెక్షన్ (54 శాతం) ఇలా ప్రధానంగా పలు రకాలుగా  ప్రకటన చేసి మోసం చేస్తారని ఈ నివేదిక తెలిపింది. ఇకపోతే బ్లాక్‌చెయిన్ గురించి, దాని మోసం నివారణకు, దాని దరఖాస్తు గురించి 37 శాతం మందికి మాత్రమే తెలుసునని ప్రముఖ పరిశోధనా సంస్థ డెసిషన్ ల్యాబ్ సహకారంతో ప్రచురించిన నివేదిక తెలిపింది.

 

 

ఇలా ఎందుకు జరుగుతుందంటే భారతదేశంలో, ప్రకటన మోసం ప్రమాదాలపై అవగాహన చాలా తక్కువగా ఉంది, విక్రయదారులలో దాదాపు ఐదవ వంతు మంది తమ ప్రకటన మోసం బడ్జెట్ గురించి అస్పష్టంగా ఉన్నారు మరియు వారిలో ఎక్కువ మంది మోసపూరిత కార్యకలాపాలు మాత్రమే పెరుగుతాయని నమ్ముతారని ఎంఎంఏ ఇండియా కంట్రీ హెడ్ మోనెకా ఖురానా అన్నారు. చూసారుగా అన్ని తెలుసని మోసపోతున్న భారతీయులను ప్రపంచ దేశాలు జాలిగా చూస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: