క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈనెల 25వ తేదీన ఏసిబి కోర్టులో చంద్రబాబుపై విచారణ మొదలవ్వటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకూ చంద్రబాబుపై అనేక ఆరోపణలపై సుమారు 18 కేసులు కోర్టుల్లో ఉన్నాయి. అయితే ఏ కేసులో కూడా విచారణ జరగకుండా అన్నింట్లోను స్టే తెచ్చుకుని కంటిన్యు అవుతున్నారు నిప్పు చంద్రబాబు. చంద్రబాబు మీద కోర్టులో కేసు వేసి దాన్ని విచారణ వరకూ తీసుకురావటమంటే మామూలు విషయం కాదు.

 

చంద్రబాబు మీద కోర్టులో ఉన్న అన్నీ కేసులు జనాలకు గుర్తుండకపోవచ్చు కానీ ఓటుకునోటు కేసు మాత్రం ఈ మధ్యే జరిగింది కాబట్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. చివరకు ఆ కేసులో కూడా విచారణ జరగకుండా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనపై దాఖలైన కేసు తప్పుడు కేసంటా చంద్రబాబు ఎక్కడా వాదించటం లేదు. తనపై కేసు వేసే అర్హతే తన ప్రత్యర్ధులకు లేదని వాదిస్తున్నారు.

 

ఇంకా విచిత్రమేమిటంటే ఇదే వాదనను కోర్టులో కూడా అంగీకరిస్తు కేసుల విచారణలో స్టేలు ఇస్తున్నాయి. అలాంటి నేపధ్యంలో ఆదాయానికి మించిన ఆస్తులంటూ చంద్రబాబుపై  లక్ష్మీపార్వతి వేసిన కేసు మాత్రం విచారణకు నోచుకుంది. ఈ కేసును కూడా లక్ష్మీపార్వతి ఎప్పుడో 2005లోనే వేశారు. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇతర కేసుల్లాగే ఇది కూడా స్టే వల్లే విచారణ జరగకుండా ఆగిపోయింది.

 

కాకపోతే చంద్రబాబు దురదృష్ణమో లేకపోతే పార్వతి అదృష్టమో తెలీదు కానీ సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల ఆ ఒక్క కేసు మాత్రం విచారణకు రెడీ అవుతోంది.  ఆరుమాసాలకు పైగా స్టే ఉన్న కేసులో వెంటనే స్టేను రద్దు చేసి విచారణ మొదలుపెట్టాలని సుప్రింకోర్టు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగానే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు రంగం సిద్ధమైంది.

 

ఇన్ని కేసులు స్టేలతో మగ్గుతుంటే మరి ఈ ఒక్క కేసులో మాత్రమే విచారణ మొదలవుతోందంటే  లక్ష్మీపార్వతి విజయం సాధించినట్లే అనుకోవాలి. మరి మిగిలిన కేసుల విచారణకు సుప్రింకోర్టు ఆదేశాలు వర్తిస్తాయో లేదో అర్ధం కావటం లేదు. వర్తిస్తే స్టేలో ఉన్న  మిగిలిన కేసుల కూడా విచారణ జరగాలి కదా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: