మహా రాజకీయాల్లో రోజుకో మలుపు తెరమీదకి  వస్తూనే  ఉంది. ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి  నుంచి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్నది  ప్రశ్నార్థకంగా మారిపోతోంది. మొదట బిజెపి శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ శివసేన  పార్టీ తమ పార్టీ నాయకుడికి సీఎం సీటు కేటాయించాలని డిమాండ్ చేయడంతో బిజెపి శివసేన పొత్తు విభేదించింది.  అప్పటి నుంచి మహా రాష్ట్ర రాజకీయాలలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో శివసేన పార్టీ నాయకుడిని సీఎం సీటులో కూర్చోబెట్టాలని ఉండడంతో అటు ఎన్సీపీకాంగ్రెస్ పార్టీలతో చర్చలు కూడా జరిపినట్లు ముందుకు వచ్చింది. అయితే గవర్నర్ మూడు పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం వచ్చినప్పటికీ మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.

 

 

 

 కానీ ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే కొన్ని రోజుల్లో శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కనిపిస్తోంది. అయితే తాజాగా శివసేన ఎంపీ సంజయ్ దత్ మరోసారి పలు  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు  కోరుకుంటున్నారని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్  అన్నారు. డిసెంబర్ 1 లోపు శివసేన పార్టీ కాంగ్రెస్ ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేడు మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్  ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర లో ప్రభుత్వం ఏర్పాటు సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. డిసెంబర్ 1 లోపు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని వ్యాఖ్యానించడం ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తిని రేపుతోంది. 

 

 

 

 ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయం కూడా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. నిన్నటి వరకు కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన పొత్తు  పై చర్చలు జరిపాయి అని  ఆయన తెలిపారు. ఇక తదుపరి రెండు రోజులు మహారాష్ట్రలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు విషయం గురించి చర్చిస్తాం  అంటు సంజయ్ రౌత్  వ్యాఖ్యానించారు. శివసేన కాంగ్రెస్ ఎన్సిపి పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు సహా  సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శివసేన పార్టీకి సంబంధించిన నాయకుడే మహారాష్ట్ర ప్రజలు  తదుపరి ముఖ్యమంత్రి గా ఉండాలని కోరుకుంటున్నారు  అంటూ శివసేన నేత సంజయ్ రౌత్  వ్యాఖ్యానించడం మహా రాజకీయాలు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: