కరీంనగర్ జిల్లాలోని ఓ అధికార పార్టీ నేత ధరల తీరు ఏకంగా ఆ‍యన కమీషన్ల పట్టికే రెడీ చేసారు ఒక్కో పనికి ఒక్కో రేటు పనిలో డబ్బుని బట్టి కమీషన్  ఆ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనికైనా ఇదే తీరు  దీని వలన పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఈ సంఘటన  కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న ఓ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎప్పటి నుంచో పార్టీలో సేవలు అందిస్తూ అందరికీ సుపరిచితమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

 

అయితే ఇటీవల ఆయన అనుసరిస్తున్న తీరే అందరికీ ఆశ్చర్యాన్ని, ఒకింత ఇబ్బందిని కలిగిస్తోందట. నియోజకవర్గంలో చాలాచోట్ల తన హవా కొనసాగిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి, ఏకంగా కమిషన్‌ల ధరల పట్టిక విడుదల చేశారటఆ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ పార్టీ సెకండ్ క్యాడర్ నేతలు, గ్రామాల ప్రజా ప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారట.

 

సదరు ఎమ్మెల్యే. నేరుగా మాట్లాడలేని పరిస్థితుల్లో, లోకల్‌గా వుండే పార్టీ సెకండ్‌ క్యాడర్ నేతలతో కాంట్రాక్టర్లకు చెప్పిస్తున్నారట. ఇటీవల నియోజకవర్గంలోని ఓ భవన కాంట్రాక్ట్ విషయంలో 30 వేలు ఇచ్చాకే ప్రొసీడింగ్స్ కాపీ, చేతికి అందించారని సదరు ఎమ్మెల్యేపై చర్చ జరుగుతోంది. ఇలా ఆ పని ఈ పని అని తేడా లేకుండా ఆ ఎమ్మెల్యే గారు నాలుగు పువ్వులు ఆరు కాయలుగా సంపాదన స్టార్ట్ చేశారని సొంత పార్టీలోని నేతలే గుసగుసలాడుకుంటున్నారట.

 

డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ ఎమ్మెల్యే, ప్రొసీడింగ్స్ కి కమిషన్ ల వసూళ్లేంటని, కిందిస్థాయి కార్యకర్తలు మండిపడుతున్నారట. అవినీతి జరిగితే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెబుతుంటే, ఈ ఎమ్మెల్యే చేస్తున్న పని మాత్రం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని పార్టీలోని కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం కాస్త ఆ నోటా ఈనోటా, అధిష్టానం దృష్టికి కుడా వెళ్లినట్టు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెవిలోనూ ఈ ఎమ్మెల్యే గారి కమిషన్ బాగోతం పడిందట. ఇంటెలిజెన్స్ సమాచారం కూడా సిఎంవో తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: