పెళ్ళైన జంట హనీమూన్ కు వెళ్లాలని అనుకుంటారు.  దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం మనకు తెలిసిన విషయమే.  డబ్బు ఉన్నవ్యక్తులు విదేశాలకు వెళ్తారు.  ఎగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తులు ఇండియాలోనే కూల్ ప్రదేశాలకు వెళ్తుంటారు.  సామాన్య వ్యక్తులు ఇంట్లోనే కానిచ్చేస్తుంటారు.  పిండి కొలది రొట్టె.. డబ్బు కోసం హంగామా.. ఆర్భాటం అన్ని ఉంటాయి. ఇక ఇదిలా ఉంటె, ఇటీవలే హనీమూన్ కోసం ఓ జంట హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలి వెళ్ళింది.  మనాలిలో వారం రోజులపాటు ట్రిప్ ఉండాలని ప్లాన్ చేసుకున్నారు.  


మనాలిలోని డోబీ ప్రాంతం పారాగ్లైడింగ్ కు ప్రసిద్ధి.  ఎక్కువమంది అక్కడ పారాగ్లైడింగ్ చేస్తుంటారు.  సాహసంతో కూడుకున్నదే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే థ్రిల్లింగ్ కలిగిస్తుంది.  తమిళనాడు నుంచి మనాలి వెళ్లిన నవ దంపతులు డోబీ ప్రాంతానికి వెళ్లారు.  భర్తకు పారాగ్లైడింగ్ చేయాలనిపించింది.  దానికి భార్య కూడా అనుమతి ఇవ్వడంతో వెంటనే పారాగ్లైడింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు.  


పారాగ్లైడింగ్ చేస్తుండగా సడెన్ గా బెల్ట్ ఓడిపోవడంతో భర్త కిందపడిపోయాడు.  ఎత్తునుంచి కిందపడిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు.  కళ్ళముందే భర్త అలా మరణించడంతో ఆ భార్య కన్నీరుమున్నీరైంది.  ఈ సంఘటన ఆమె కుటుంబంలో విషాదం నింపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాజధాని చెన్నైలోని అమింజికరై తిరువీధి అమ్మన్‌ ఆలయం వీధికి చెందిన అరవింద్‌ కు ప్రీతి అనే యువతితో గత వారం వివాహమైంది.  


కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట హనీమూన్ కు వెళ్లడం.. సరదాగా డోబీకి వెళ్లి పారాగ్లైడింగ్ చేయాలి అనుకోవడంతో పారాగ్లైడింగ్ బెల్ట్ తెగి కిందపడి మరణించడంజరిగిపోయింది .  ఈ ప్రమాదంలో పారాగ్లైడర్ కు కూడా గాయాలయ్యాయి.  అరవింద్ సరిగా బెల్ట్ పెట్టుకోకపోవడం వలనే ఇలా జరిగిందని ప్రాధమిక విచారణలో తేలింది.  ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.  అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: