ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో జలాశయాలన్నీ కూడా నిండిపోయాయి. పంటలకు కావాల్సినంత నీరు జలాశయాల్లో ఉన్నది.  అలానే భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  అంతా హ్యాపీగా ఉన్నది.  అయితే, ఇప్పుడు ఏపీకి మరో సమస్య వచ్చిపడింది.  అదేమంటే శ్రీశైలం డ్యామ్.  శ్రీశైలం డ్యాం సురక్షితంగా లేదని, నీటి ఉద్రిక్తత పెరిగితే.... కోతకు గురికావాల్సి వస్తుందని, శ్రీశైలం డ్యాం వద్ద కొంత పగుళ్లు వచ్చాయని, వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేయాలనీ వాటర్ మ్యాన్ అఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు.

 
రాజేంద్ర సింగ్ చెప్పినదాన్నీ బట్టి తీవ్ర హైడ్రోలిక్‌ ఒత్తిడి వల్ల నీటి వేగం అధికంగా ఉంటుందని.. దీంతో డ్యామ్ కోతకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పగుళ్లతో వాటర్ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని.. డ్యామ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదంగా మారిందని తెలిపారు. ఒకవేళ డ్యాం కోతకు గురైతే.. దానివలన సగానికిపైగా ఏపీకి నష్టం వస్తుందని, అటు శ్రీశైలానికి దిగువున ఉన్న నాగార్జున సాగర్ డ్యాం కొట్టుకుపోతుందని అయన పేర్కొన్నారు.  


600 మంది సిబ్బంది పనిచేయాల్సిన ప్రాంతంలో 100 మంది మాత్రమే పనిచేస్తున్నారని, ఇదిలానే కొనసాగితే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు.  ఈ పరిస్థితుల నుంచి బయటపాడాలి అంటే మరమ్మత్తులు చేయక తప్పదని అన్నారు.  ఈ మరమ్మత్తుల కోసం రూ. 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. ఇక ప్రోజెక్టుల గురించి కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు.  


ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు తప్పించి.. వాటి పరిరక్షణ విషయాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు.  రెండు నెలల క్రితం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి.  ఈ వర్షాల కారణంగా జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.  ఇలా జలాశయాలు నిండటంతో.. ప్రజలు హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా భయం పట్టుకుంది. మరి రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలతో ప్రభుత్వం ఏకీభవించి మరమ్మత్తులు చేస్తుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: