బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీలో నీలి చిత్రాలు చూస్తూ మీడియా కెమెరాల సాక్షిగా అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ లోనే కాదు.. మహారాష్ట్ర అసెంబ్లీలో అదే బిజెపి ఎమ్మెల్యేలు నీలి చిత్రాలు చూస్తూ కెమెరాలకు దొరికిపోయారు. ఇప్పుడు ఏకంగా బిజెపికి చెందిన ఓ కీలక నాయకుడు ఓ మహిళతో కామకలాపాలు సాగిస్తున్న విషయం వెలుగు చూసింది. సదరు బీజేపీ నాయకుడి రాసలీలల వీడియో బయటకు రావడంతో ఆ పార్టీ నాయకులు అంతా షాక్ కు గురయ్యారు.

 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ డామన్, డయ్యూ అధ్యక్ష పదవికి 63 ఏళ్ల గోపాల్ టండెల్ రాజీనామా చేశారు. బీజేపీ ఎంపీ అయిన గోపాల్ టండెల్ బూతుపురాణం బయటకు రావడంలో మా పార్టీలోని కొందరు నాయకుల (బీజేపీ) హస్తం ఉందని స్వయంగా ఆయనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం కొసమెరుపు. గోపాల్ టండెల్ తన రాజీనామా లేఖను బిజెపి జాతీయ అధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు పంపించారు.

 

అయితే తాను ఏం రాసలీలలు కొనసాగించ లేదని... సొంత పార్టీలోని కొందరు నాయకులు కావాలనే తనను తన పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం అయిన బిజెపి అధ్యక్షుడిగా ఉన్న గోపాల్ టండెల్ ప్రస్తుతం బిజెపి ఎంపీ గా ఉన్నారు. గతంలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేసిన ఆయన ఆ తర్వాత ఆ పార్టీల‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు.

 

63 ఏళ్ల గోపాల్ ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రాసలీలలు కొనసాగిస్తున్న వీడియో వైరల్ అయింది. తన పరువు తీసిన వారిని వెంటనే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయ‌న‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే వైరల్ అయిన సెక్స్ వీడియోలో మహిళతో కలిసి ఉన్నది గోపాల్ టండెల్ అని కొందరు బీజేపీలోనే నేతలే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: