ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ పాలనను గాడిలో పెట్టారు . ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేసేందుకు  కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని వర్గాలకు చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా ఉండేలాగా పాలన అందిస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి మెరుగైన విద్య వైద్యం వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తాజాగా మరో సంచలన పథకానికి ఊపిరి పోశారు ఆయన. 

 

 

 

 నేడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు అందరికీ వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం లో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు అందరికీ వైఎస్ఆర్ మత్స్యకార  భరోసా పథకం ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ మత్సకార  భరోసా పథకం ద్వారా మత్స్యకారుల అందరికీ వేట విరామ సాయం  4వేల నుంచి 10వేల రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. 

 

 

 

 అంతేకాకుండా డీజిల్ రాయితీ 6.03 పైసల నుంచి కి  పెంచి మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. కాగా  వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం రాష్ట్రంలోని లక్షా 35 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావు... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 70 శాతం పనులు పూర్తి చేశారని రాష్ట్రంలోని అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని రంగాల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గాడితప్పిన పాలనను ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాడిలో పెట్టి ఆర్థిక క్రమశిక్షణ తో రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన పథకాలను అందిస్తున్నారని అన్నారు. మత్స్యకారుల అందరి మధ్య ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: