జెట్టి గీతారెడ్డి 1947 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే 72 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆమె కాంగ్రెస్ హయాంలో ఎన్నో మంత్రి పదవులు అనుభవించిన ఘనత ఆమెకే దక్కింది. మాజీ మంత్రి గీతారెడ్డి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. రాజకీయాలకే కాదు.. జహీరాబాద్ నియోజకవర్గానికి, పార్టీకి ఆమె పూర్తిగా దూరమయ్యారని చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో ఆ పార్టీ నేతలు  కుదేలు అయిపోయారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా చేసిన నేతలు ఎవరు ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. అందులో గీతారెడ్డి కూడా ఒకరు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనడం లేదు. పార్టీ కూడా గీతారెడ్డిని పట్టించుకోవడంలేదని పుకార్లు షికార్లు అవుతున్నాయి. అసలు గీతారెడ్డి రాజకీయంగా ఉన్నట్లా? లేనట్లా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

 

 సీనియర్ నేతగా..... జెట్టి గీతా రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న నేత. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద గీతారెడ్డి మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవుల జాబితాలో తొలి పేరు గీతారెడ్డిదే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సబ్జెక్ట్ పరంగా బాగా అధ్యయనం చేసే గీతారెడ్డి తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తారనే పేరుంది. 

 

 జహీరాబాద్ నియోజకవర్గానికి గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత గీతారెడ్డి రాత తిరగబడింది. 2018 ఎన్నికలు జహీరాబాద్‌లో నుంచి పోటీచేసి గీతారెడ్డి ఓటమిపాలయ్యారు. వరుసగా ఓటమి చెందడం కాంగ్రెస్‌కు ఇక రాష్ట్రంలో భవిష్యత్ లేదని తెలియడంతో.. గీతారెడ్డి జహీరాబాద్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. హైదరాబాదులోనే ఎక్కువగా ఉంటున్నారు. 

 

నడిపే వారేరీ.గీతారెడ్డి పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెసును నడిపించే నేత లేరు. కొత్త ఇంచార్జి నియమించాలన్న గీతారెడ్డిని కాదనే శక్తి పార్టీ అగ్రనేతలకు లేదు. మరోవైపు గీతారెడ్డికి వారసులు ఉన్నప్పటికీ రాజకీయంగా వారసత్వం అందుకునేందుకు వారు ముందుకు రావడం లేదు. అందుకే తిరిగి ఆ కుటుంబం నుంచి గీతారెడ్డి మాత్రమే రాజకీయాలలో యాక్టివ్‌గా అవ్వాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: