అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రాష్ట్రంలోని  మత్స్యకారులకు  చేయూతనిచేందుకు  ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వైయస్సార్ మత్స్యకార భరోసా పథకానికి ఊపిరి పోశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి మత్స్యకార కుటుంబానికి తోడుగా నిలుస్తాం అంటూ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా  కార్యక్రమం ద్వారా వేట విరామా  సాయాన్ని  4000 నుంచి 10వేల రూపాయలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా డీజిల్ రాయితీని  6.03  నుండి 9 పెంచుతున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... పశువుల్లంక  సలాదివారిపాలెం వంతెనను ప్రారంభించారు... అంతేకాకుండా కోమనాపల్లి లో టూరిజం కంట్రోల్ గదులకు  కూడా సీఎం జగన్  శంకుస్థాపనలు చేశారు. 

 

 

 కాగా  ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడారు జగన్.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర  తీరప్రాంతం ఉన్నప్పటికీ... మత్స్యకారులు బతుకుదెరువు కోసం పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో దాపురించిందని... కానీ తమ  ప్రభుత్వ హయాంలో గంగపుత్రుల జీవితాలలో మార్చే నిర్ణయాలు  తీసుకున్నాం అంటూ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ ప్రకటన చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటూ ఆయన తెలిపారు. ఆదాయం కోల్పోయిన ప్రతి మత్స్యకార కుటుంబానికి అండగా ఉంటానని పాదయాత్రలో చెప్పానని... చెప్పిందే చేస్తున్నాం అంటూ జగన్ గుర్తుచేశారు. అప్పట్లో వేట నిషేధ కాలంలో కేవలం మత్స్యకార కుటుంబానికి నాలుగు వేలు మాత్రమే ఇచ్చేవారని ... గత ముఖ్యమంత్రి మాటలు భారీగా చెప్పి సహాయం మాత్రం అరకొరగా చేసేవారని  జగన్ ఆరోపించారు. ఆ చేసిన అరకొర సహాయం కూడా కొంత మందికే ఇచ్చే వారని తెలిపారు. కానీ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సమస్యలను తీర్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

 

 

 అందుకే వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబానికి నాలుగు వేల రూపాయలుగా ఉన్న సాయం ₹10000 పెంచుతున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజల సమస్యలు తీర్చడం కోసమే ముఖ్యమంత్రి హోదాలో తాను కూర్చున్నారని ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారులకు డీజిల్ pai రాయితీ 9 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతే కాకుండా రాష్ట్రంలో పిల్లల జీవితాలను మార్చేందుకు మెరుగైన విద్యను అందించేందుకు నాడు నేడు చేపడుతున్నామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అయితే నాడు-నేడు కార్యక్రమంపై  ఎంతో మంది విమర్శలు గుప్పిస్తున్నారని .. విమర్శలు చేస్తున్న వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు అంటూ జగన్ ప్రశ్నించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్య ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు జగన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: