నాలుగు రోజుల క్రితమే టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిన యువనేత దేవినేని అవినాష్ కు జగన్మోహన్ రెడ్డి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఎప్పటి నుండో మనసుపడిన విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను దేవినేనికి జగన్ అప్పగించారు. హఠాత్తుగా జగన్ చేసిన పనికి దేవినేని తో పాటు పార్టి నేతలు కూడా ఆశ్చర్యపోయారు.

 

నిజానికి నాలుగు రోజుల క్రితమే పార్టీలో చేరిన నేతకు ఏ పార్టీకూడా ఇంత పెద్ద బాధ్యత అప్పగించదు. పైగా టిడిపిలో ఉన్నపుడు విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించమని దేవినేని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబునాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు.  అందుకనే ఈ నియోజకవర్గం నుండి దేవినేని పోటి చేయాలని అనుకున్నా సాధ్యం కాలేదు.

 

అలాంటిది నాలుగు రోజుల క్రితం వైసిపిలో చేరిన తనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని అవినాష్ కూడా ఊహించలేదు. పార్టీలో చేరేటపుడు యువనేత  ను ఏం అడిగారో ? జగన్ ఏమని హామీ ఇచ్చారో ? ఇంత వరకూ స్పష్టంగా తెలియలేదు. కానీ నియోజకవర్గ బాధ్యతలు ఇంత తొందరగా ఇస్తారని మాత్రం అనుకునుండరు.

 

సరే దేవినేని విషయాన్ని పక్కనపెడితే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతలున్నారు. ఒకరు మాజీ ఎంఎల్ఏ యలమంచిలి రవి. రెండో నేత పోయిన ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయిన  భావకుమార్. ప్రస్తుతం రవినే ఇన్చార్జిగా ఉన్నారు. అలాంటిది అవినాష్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత రవి, భావకుమార్ ఏం చేస్తారన్నది పెద్ద సస్పెన్సుగా మారింది.

 

తనకు బాధ్యతలు అప్పగించిన జగన్ కు  ట్విట్టర్ ద్వారానే  దేవినేని కృతజ్ఞతలు తెలుపుకున్నారు. టిడిపిలో ఉన్నపుడు చంద్రబాబు తన భుజం మీద చెయ్యివేసి మాట్లాడటం తప్ప మరేమీ చేయలేదన్నారు. భుజం మీద చెయ్యివేస్తే మంచి చేసినట్లేనా ? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. మొత్తానికి దేవినేని కోరిక తీరింది కాబట్టి భవిష్యత్తులో ఏమాత్రం యాక్టివ్ గా పనిచేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: