ఆర్టీసీ కార్మికులు మరో మెట్టు దిగారు. ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తారని ప్రకటన చేసింది. ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ జేఏసీ కోరింది. మరోవైపు ఈరోజు సీఎం కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రకటనల నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేస్తున్న సమీక్ష కీలకంగా మారింది. 
 
ఈ సమావేశానికి ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అడ్వకేట్ జనరల్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ ఈ భేటీలో జేఏసీ ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని రెండుసార్లు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ రెండుసార్లు కోరినా ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మెను వీడలేదు. 
 
జేఏసీ నేతలు ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులు కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం డ్యూటీలో చేరాలంటే షరతులు తప్పవని చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ఎలాంటి షరతులు పెడుతుందో చూడాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తరువాత సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఆర్టీసీ కార్మికుల్లో ఇటు ప్రజల్లో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. 
 
ఆర్టీసీ కార్మికులు లేబర్ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు అందలేదు. రెండు నెలల నుండి జీతాలు లేకపోవటంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 29 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె కాలంలో మృతి చెందారు. ప్రభుత్వం మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల గురించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: