ప్రజల సొమ్ము పాము వంటిది అని సామాన్యుడు భావిస్తుంటే, పరుల సొమ్ము పానకం వంటిది అని కొందరు బడా నాయకులు భావిస్తుంటారు. సామాన్యుడు బ్యాంకుల నుండి ఋణం పొందడానికి నానా అగచాట్లు పడుతుంటే,ఋణం ఎగరగొట్టే వారికే బ్యాంకులు ఎర్ర తివాచీలు పరిచి మరీ రుణాలు మంజూరు చేస్తుంటాయి ఇలా ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఎట్టకేలకు విడుదల చేసింది. ఇంగ్లీష్ పత్రిక ది వైర్ ఈ ఏడాది మే నెలలో ఆర్టీఐ చట్టం కింద ఈ జాబితా కోసం దరఖాస్తు చేసుకుంది. 2019 ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు దాటిన 30 మంది పెద్ద రుణ ఎగవేతదారుల జాబితాను విడుదల చేసింది. దాదాపు పదేళ్లుగా ఈ జాబితా విడుదలకు ఆసక్తి చూపని ఆర్బీఐ ఎట్టకేలకు విడుదల చేసింది.

 

 

     దేశ ఆర్థిక వ్యవస్థను వీరు కుదేలుచేస్తున్నారు. ఇప్పటివరకు రక రకాల కారణాలవల్ల ఎగవేతదారుల పేర్లు వెల్లడించలేమని ఇప్పటి వరకు ఆర్బీఐ చెబుతూ వచ్చింది. మరోవైపు బ్యాంకులు ఎగవేతదారులపై కేసులు నమోదు చేస్తున్నాయి. బ్యాంకుల వల్ల ఎగవేతదారుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆర్బీఐ జాబితాను బయట పెట్టింది.

 


      ఇప్పుడు ఆర్బీఐ విడుదల చేసిన ముప్పై మంది జాబితాలో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తదితరుల కంపెనీలు ఉన్నాయి. చోక్సీకి చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన రుణాల విలువ మొత్తం రూ.50వేలకోట్లు దాటింది. బ్యాంకులు రద్దు చేసినవి కలుపుకొని ఈ మొత్తం దాటింది.ఈ డేటాను కేంద్రీకృత బ్యాంకింగ్ సమాచారం ది సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్ నుంచి తీసుకొని విడుదల చేసింది. ఇందులో రూ.5 కోట్లకు పైగా రుణం తీసుకున్న వారి సమాచారం ఉంటుంది. 2018లో ట్రాన్స్ యూనియన్ సిబిల్ లెక్కల ప్రకారం 2018లో 11,000 కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.1.61 లక్షల కోట్లకు సమానం.

 


రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా విడుదల చేసిన  రుణాల ఎగవేతదారులలో వున్నా ప్రముఖులు వీరే  గీతాంజలి జెమ్స్,

రేయ్ఆగ్రో లిమిటెడ్,

విన్ సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ లిమిటెడ్,

రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్,

రోటోమాక్ గ్లోబల్ ప్రయివేటు లిమిటెడ్,

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్,

కుదోస్ కెమికల్స్ లిమిటెడ్,

జూమ్ డెవలపర్స్,

దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్

ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్

ఫరెవర్ ప్రిసీయస్ జ్యువెల్లర్స్ అండ్ డైమండ్స్

సూర్య వినాయక ఇండస్ట్రీస్ లిమిటెడ్

ఎస్ కుమార్స్ నేషన్ వైడ్ లిమిటెడ్

గిలి ఇండియా లిమిటెడ్

సిద్ది వినాయక లాజిస్టిక్స్ లిమిటెడ్

వీఎంసీ సిస్టమ్ లిమిటెడ్

గుప్తా కోల్ ఇండియా

నక్షత్ర బ్రాండ్స్ లిమిటెడ్

ఇండియన్ టెక్నాలీస్ కంపెనీ లిమిటెడ్

శ్రీ గణేష్ జ్యువెల్లర్ హౌస్ లిమిటెడ్

జైన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్

సూర్య ఫార్మాస్యూటికల్ లిమిటెడ్

నకోడా లిమిటెడ్ కేఎస్ ఆయిల్స్ లిమిటెడ్

కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్

హానుంగ్ టాయ్స్ అండ్ టెక్స్ట్ టైల్స్ లిమిటెడ్

ఫస్ట్ లీజింగ్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్

కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ యాక్షన్ ఇస్పాట్ అండ్ పవర్ ప్రయివేటు లిమిటెడ్

 

మరింత సమాచారం తెలుసుకోండి: