ఈకాలంలో టెక్నాలజీ పెరిగింది. ఏదైన అవసరం తీర్చుకోవాలంటే జేబులో డబ్బులు ఉండవలసిన అవసరం లేకుండా పోయింది. చేతిలో సెల్ అందులో పేటీఎం వాలెట్ ఉంటే సరిపోతుంది. లేదా జేబులో క్రెడిట్ కార్డ్ ఉంటే చింత ఉండదు. ఒకప్పుడైతే ఏ చిన్న అవసరానికైనా జేబునిండా, పర్సు నిండా పైసలు నింపుకుని వెళ్లే వారు.

 

 

అందరి ముందు దర్జాగా ఆ డబ్బులు లెక్కపెడుతుంటే వచ్చే ఆనందం వేరుగా ఉండేది. కాని ఇప్పుడు ఎవరి దగ్గర ఎన్ని డబ్బులున్నాయో కూడా తెలియడం లేదు ఏ అవసరం ఉన్న ఫోన్ నొక్కడం చేస్తున్నారు. ఇకపోతే ఇలా మాటి మాటికి పేటీఎం వాలెట్ ఉపయోగిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు..

 

 

ఎందుకంటే మీకు తెలియకుండా మీ వాలెట్ నుంచి డబ్బులు మాయం కావొచ్చు. దీనికి కారణం ఎంటంటే, కేవైసీ అంటూ దేశీ ప్రముఖ ఇ-వాలెట్‌ సంస్థ అయిన పేటీఎం ఇప్పుడు కస్టమర్లను ఈ విషయం పై హెచ్చరిస్తోంది. మీకు వచ్చే మోసపూరిత ఎస్ఎంఎస్‌లతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ  వెల్లడించారు.

 

 

అకౌంట్ బ్లాక్‌కు సంబంధించిన ఎస్ఎంఎస్‌లు, కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. మేం ఎలాంటి మెసేజ్‌లు పంపించడం గాని, ఇతర యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని అస్సలు చెప్పడం లేదు.. కాబట్టి యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మోసగాళ్లు మీ అకౌంట్ వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించొచ్చు  అని ట్వీట్ చేశారు.

 

 

ఇకపోతే సైబర్ నేరగాళ్లూ కేవైసీ వివరాలు సమర్పించకపోతే మీ అకౌంట్‌ బ్లాక్‌ అవుతుందని, సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమంటూ వినియోగదారులకు ఎస్ఎంఎస్‌లు పంపిస్తున్నారని  ఫిర్యాదులు అందడంతో, విజయ్‌ శేఖర్‌ శర్మ ట్విట్టర్ వేదికగా కస్టమర్లను ఈ విధంగా అలర్ట్‌ చేశారు.. ఇక ఎక్కువగా మోసాలను మోసగాళ్లు పేటీఎం నుంచి కాల్ చేస్తున్నామని, మీ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, దాన్ని రీయాక్టివేట్ చేసుకోవాలని ఈ పద్దతిలో చెబుతారు.

 

 

దీని కోసం ఎనీడెస్క్, టీమ్‌వ్యూయర్, క్వి్క్‌సపోర్ట్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని కోరతారు. కాని మీరుగనుక ఇలా చేస్తే మీ వాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమౌతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండగలరు. ఒకవేళ మీరు మోసపోతే వెంటనే కస్టమర్ల కేర్ నెంబర్ 1800120130, 0120-4456456కు కాల్ చేసి విషయాన్ని తెలియజేయండని తెలిపారు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: