తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో చోరీ జరిగింది. గత నెల 23వ తేదీన హుండీ లెక్కింపు కోసం వచ్చిన ఒక వ్యక్తి బంగారు, వెండి నగలను దొంగలించాడు. వేములవాడ రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో భారీగా నగలు చోరీకి గురయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. గత నెల 23వ తేదీన హుండీ లెక్కింపు కోసం వచ్చిన వ్యక్తి భారీగా వెండి నగలను, కొన్ని బంగారు నగలను ఎత్తుకొనివెళ్లాడు. 
 
దొంగతనం చేసిన తరువాత ఆ నగలను బయటకు తీసుకొనివెళ్లటానికి ఆ దొంగ భయపడ్డాడు. ఆ నగలను వడిబియ్యాలను వేసే హుండీలో దొంగ వేశాడు. ఈ ఘటన జరిగిన తరువాత రోజు ఫిరోజ్ అనే వ్యక్తి వడిబియ్యం సంచిని ఎత్తుకెళ్లాడు. గతంలో ఫిరోజ్ పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ పోలీసులు గతంలో జరిగిన ఆలయ దొంగతనాలపై విచారణ చేపట్టగా ఫిరోజ్ పై పోలీసులకు అనుమానం కలిగింది. 
 
ఫిరోజ్ ను పోలీసులు పిలిపించి విచారణ చేయగా వేములవాడ ఆలయంలో జరిగిన దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ పోలీసులు వేములవాడ పోలీసులకు విచారణ బాధ్యతలను అప్పగించారు. వేములవాడ ఆలయం తగిన భద్రతా ఏర్పాట్లను కలిగి ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో వేములవాడ రాజరాజేశ్వరీ దేవి గుడిలో దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఒక వ్యక్తి ఈ ఆలయంలో దొంగతనం చేయగా పోలీసులు ఆ దొంగను వెంటనే పట్టుకున్నారు. 
 
పాత నేరస్థుడు ఫిరోజ్ దొరకటంతో ఆలయంలో దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్ నగలను మరొకరు దొంగలించినట్లు పోలీసులకు విచారణలో వెల్లడించాడు. పోలీసుల దర్యాప్తు తరువాత పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆలయాల్లో దొంగతనాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉండటంతో ఆలయాలకు తగిన భద్రత కల్పించాలని భక్తులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: