తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అగమ్యగోచరంగా మారింది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగే పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ ఉందా లేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పై ఆశలు పెట్టుకుంది . గత ఐదు నెలల నుంచి కాంగ్రెస్ పీసీసీ పదవి లో ఎవరూ లేరు. ఇప్పుడు ఈ అంశమే కాంగ్రెస్ నాయకుల్లో  కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై  తాజాగా చర్చించిన అధిష్టానం... కాంగ్రెస్ పిసిసి పదవిని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి కాంగ్రెస్ పీసీసీ పదవి కోసం ఢిల్లీ రావాలని కోరినట్లు తెలుస్తోంది. 

 

 

 

 అయితే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావచ్చని అధిష్టానం నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ పిసిసి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి సరైన వ్యక్తి అని నమ్మి సోనియాగాంధీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  మాత్రం కాంగ్రెస్ పిసిసి పదవిపై విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో తాను పిసిసి బాధ్యతలు చేపట్టడం సరైంది కాదని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసమే పిసిసి పదవి విషయంలో తాను విముఖతతో ఉండడానికి గల కారణాలు వివరించేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పిసిసి పదవి చేపట్టేందుకు నిరాకరిస్తే ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవి కేంద్ర మాజీ రక్షణ మంత్రి పళ్లంరాజు కు కట్టబెట్టి యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 అయితే ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవి కోసం కు ఉమెన్ చాందీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలతో చర్చించి... కాంగ్రెస్ నేతలందరూ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టాలని కోరుకుంటున్నారో  నివేదిక ఇవ్వాలని అధిష్టానం సూచించిన మేరకు కిరణ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టానానికి నివేదికలో  రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత పళ్లంరాజు పేరును కూడా ఉమెన్ చాంది నివేదికలో తెలిపింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ బయలుదేరిన కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి పదవి విషయంలో విముఖతకు గల కారణాలను అధిష్టానానికి వివరించగా అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి కారణాలతో సంతృప్తి చెంది ఆంధ్ర ప్రదేశ్ పిసిసి పదవిని పళ్లంరాజు కట్టబెడుతుందా  లేదా కిరణ్ కుమార్ రెడ్డిని కాంప్రమైస్ చేసి కిరణ్ కుమార్ రెడ్డికి పిసిసి పదవిలో కూర్చోబెట్టబోతుందా  అనేది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. మరి ఏపీపిసిసి పదవి చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవంవస్తుందా  లేదా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: