చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో చక్రం తిప్పినట్టుగా 2019 లో కూడా తిప్పుదామని అనుకున్నారు.  2014లో పవనాలు బాబువైపు వీయడంతోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు అనేకసార్లు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వలనే గెలిచాడని చెప్పిన బాబు, 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఆయన్ను పక్కన పెట్టడంతో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే.  కలిసున్నప్పుడు ఉండే బలం విడిపోయిన తరువాత కనిపించదు.  


ఈ విషయం బాబుకు తెలిసినా.. ప్రజలపై ఉన్న నమ్మకంతో బాబు పోటీ చేశారు.  పార్టీ ఓడిపోతుందని అనుకున్నా.. మరి ఈ స్థాయిలో ఓటమిపాలవుతుందని బాబు ఊహించలేదు.  బాబే కాదు అసలు తెలుగుదేశం పార్టీ అసలు ఊహించనేలేదు.  తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.  అటు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. 


కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.  అదీ రాజోలు సీటు మాత్రమే గెలుచుకుంది.  పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడు.  రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోవడం వలనే వైకాపాకు కలిసి వచ్చింది.  అయితే, ఎన్నికల్లో రెండు పార్టీలు ఓడిపోయిన తరువాత రెండు కలిసి మరలా ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రెడీ రెడీ అవుతున్నాయి.  విశాఖలో లాంగ్ మార్చ్ కు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది.  


అయితే, గతంలో ఏమోగానీ, ఇప్పుడు చంద్రబాబుకు పవన్ సపోర్ట్ లేకుంటే.. బాబుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడదని, బాబు మరలా ముందుకు వెళ్ళాలి అంటే.. పవన్ సపోర్ట్ తప్పని సరిగా ఉండాలి.  అలా ఇద్దరు కలిసి పనిచేస్తేనే ముందుకు వెళ్తారని  రెండు పార్టీల నాయకులూ అంటున్నారు.  మరి ఇద్దరు కలిసి పనిచేస్తారు లేదా అన్నది వారి చేతుల్లోనే ఉన్నది.  జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అనుకోవచ్చు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: