ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థ కావడంతో పాటు ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడం సహా  తమ 26 డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమర్పించిన నివేదికపై అటు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు అందరూ ప్రభుత్వం బేషరతుగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే దసరా పండుగ నేపథ్యంలో ఎక్కువగా ఆర్టీసీకి లాభం వస్తుంది కాబట్టి దసరా పండుగ ముందు ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆర్టీసీ జేఏసీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలో సమ్మె సైరన్ మోగించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె మొదలు కావడంతో రాష్ట్రంలో ప్రజానీకం ప్రయాణం  ఒక్కసారిగా స్తంభించిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తిరిగి రాలేదు. 

 

 

 

 అయితే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను ఎన్నిసార్లు ఉధృతం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం దిగిరాలేదు. అయితే కేసీఆర్ కూడా అటు సంచలన ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం విధించిన డెడ్ లోపు  ఉద్యోగాల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్  అయినట్టే అంటూ  కేసీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ కెసిఆర్ పెట్టిన డెడ్ లైన్ లతో కార్మికులు మాత్రం వెనకడుగు వేయలేదు.... ఆ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపింది ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం డిమాండ్ మినహా  మిగతా డిమాండ్ల పై  చర్చిస్తామని తెలిపారు. అయినప్పటికీ ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం అక్కడ బెట్టు  ప్రదర్శించి చర్చలు నుంచి అర్ధాంతరంగా ని బయటికి వచ్చేశారు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతల తీరుపై  ప్రభుత్వం విసిగిపోయింది  . దీంతో ఆర్టీసీ జేఏసీ ప్రైవేటీకరణకు అంతా సిద్ధం చేసింది ప్రభుత్వం. 

 

 

 

 ఇక ప్రభుత్వం దిగివచ్చేలా  లేదని భావించిన ఆర్టీసీ జేఏసీ నేతలు హైకోర్టులో అయినా న్యాయం జరుగుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అటు హైకోర్టులో కూడా వాయిదాల మీద వాయిదాలు విచారణల  మీద విచారణలు  జరిగినప్పటికీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం అక్కడ న్యాయం జరగలేదు. అటు ఆర్టీసీ  కార్మికులు కూడా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదు అంటూ మండిపడుతున్నారు. ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఏకంగా సమ్మె 47 రోజులకు చేరుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మె విషయాన్ని లేబర్ కోర్టు తేల్చుకోవాలని హైకోర్టు చెప్పడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆలోచనలో పడ్డారు. అసలు సమ్మె భవితవ్యం ఏంటి ఆలోచనలో పడ్డారు. ఈక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మొన్నటివరకు డిమాండ్లు నెరవేర్చే  వరకు సమ్మె  విరమించేది లేదని తేల్చి చెప్పిన ఆర్టీసీ జేఏసీ  ఇప్పుడు మాత్రం ప్రభుత్వంతో విజ్ఞప్తుల బేరం మొదలుపెట్టింది. 

 

 

 

 ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఆర్టీసీ జేఏసీ. మొన్నటి వరకు తమ డిమాండ్లను పరిష్కరిస్తే కానీ సమ్మె విరమించే ప్రసక్తి లేదని డిమాండ్ చేసి... ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగాల్లో చేసుకుంటే చాలు అంటూ విజ్ఞప్తి చేస్తోంది.కానీ ఆర్టీసీ జేఏసీ ప్రకటన అనంతరం తెలంగాణ ప్రజానీకమే కాదు,  ఆర్టీసీ కార్మికులు కూడా పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకున్నారు.47 రోజులపాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చు కోకుండానే సమ్మె విరమిస్తాం  అనడం కార్మికుల జీవితాలతో ఆడుకున్నట్లే  అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా  అటు కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమిస్తాం  అనడంతో దీని పై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇంకొద్దిసేపట్లో కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: