ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా  తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ చేసి సమ్మె సైరన్ మోగించింది . ఎలాంటి హెచ్చరికలు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పింది. 26 డిమాండ్లలో ఒక్కటి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పేసింది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా  సమ్మెను కొనసాగిస్తామని భీష్మించుకు కూర్చుంది ఆర్టీసీ జేఏసీ. ఇలాగే మొండిపట్టు తో 47 రోజుల పాటు సమ్మె కొనసాగిచింది . కానీ చివరికి బెట్టు వీడి మెట్టు దిగి వచ్చి ప్రభుత్వంతో బేరాలు మొదలు పెట్టింది. తమ 47రోజుల ఆర్టీసీ సమ్మెతో ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు  బలిదానాలతో  ఒక్కటంటే ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకుండానే సమ్మె విరమించింది  ఆర్టీసీ జేఏసీ. తమ డిమాండ్లను బేషరతుగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆ ఆర్టీసీ జేఏసీ... ఇప్పుడు షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. 

 

 

 

 కాగా 47 రోజుల ఆర్టీసీ సమ్మె లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నోసార్లు సమ్మెను విరమించి విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తూనే ఉన్నారు. లేకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం పట్టు వీడలేదు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం డిమాండ్  ఒక్కటి మినహా మిగతా డిమాండ్ల పరిష్కారం పై నివేదిక రూపొందించేందుకు కమిటీని నియమిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు తెలిపింది. అయినప్పటికీ ఆర్టీసీ జేఏసీ మాత్రం పట్టు వీడలేదు. తమ 26 డిమాండ్లలో   ఒక్కటి  కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పింది. అటు ఆర్టీసీ కార్మికులకు కుటుంబ పోషణ భారమై మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ జేఏసీ మాత్రం పట్టు వదలలేదు బెట్టు వీడలేదు . ఎట్టి పరిస్థితుల్లో 26 డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. 

 

 

 

 అయితే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కెసిఆర్ మాటలతో ఆలోచనలో పడ్డప్పటుకీ  తమను ముందుండి నడిపిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం తమ డిమాండ్ల పరిష్కారం అయ్యోలా చేస్తారని నమ్మకంతో ఆర్టీసీ కార్మికులు కూడా ముందుకు సాగారు. కానీ ఇన్నాళ్లు కెసిఆర్ ఎన్ని హెచ్చరికలు చేసినా ఎన్ని డెడ్లైన్ల తో  బెదిరించిన మొండి పట్టుతో సమ్మెను కొనసాగించిన  ఆర్టీసీ జేఏసీ మాత్రం ఇప్పుడు మెట్టు దిగి వచ్చింది. ఇన్నాళ్లు డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆర్టీసీ జేఏసీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేర్చుకుంటే చాలు సమ్మె విరమిస్తాం విజ్ఞప్తులు మొదలుపెట్టింది  ఆర్టీసీ జేఏసీ. ఈ నలభై ఏడు రోజుల సమ్మెలో ఆర్టీసీ జేఏసీ నేతలు  సాధించిందేమిటి... ఎంతో మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మబలిదానాలా ... లేక 47 రోజుల పాటు జీతాలు రాక తల్లడిల్లుతున్న ఆర్టీసీ కార్మికుల మనోవేదనా ... కనీసం 47 రోజుల సమ్మెతో  ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండానే  ఆర్టీసి సమ్మె విరమించడంపై  అందరూ పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మె విరమించినప్పటికి కూడా దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పటికే అధికారులతో  దీని పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది  ఇంకొంత సేపట్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: