నిరుద్యోగులకు ఈ మధ్యకాలంలో శుభవార్తల మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారి కేంద్రం నుంచి వింటే మరోసారి రాష్ట్రం నుండి ఇలా ఎక్కడొక చోట నుండి నిరుద్యోగులకు శుభవార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించాడు.   

 

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలను అందుకుంటున్నాడు. కాగా ఆంధ్ర రాష్ట్రంలో మరింత మందికి ఉద్యోగాలు ఇచ్చేనందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నాడు. 2020 జనవరికి ఆంధ్రాలో ఉద్యోగ జాతర మొదలు కానుంది. ఒక్క ఈ జనవరిలోనే కాదు సీఎం జగన్ అధికారంలో ఉన్న అన్ని రోజులు ప్రతి జనవరిలో ఉద్యోగా భర్తీ ఉంటుంది అని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలోనే విశాఖ‌ప‌ట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నవంబరు 22న అంటే రేపు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే డిసెంబరు 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

 

కాగా ఈ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ లో ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి. అయితే అందులో ఆప‌రేష‌న్ టెక్నీషియ‌న్‌, బాయిల‌ర్ టెక్నీషియ‌న్‌ ఉద్యోగాలు ఉన్నాయి. కాగా ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ పోస్టులకు రాత పరీక్షా, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికా విధానం ఉంటుంది. అయితే ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ రేపు ప్రారంభమయ్యి 21 డిసెంబర్ నెలలో ప్రక్రియ ముగుస్తుంది. 
   

మరింత సమాచారం తెలుసుకోండి: