ఆంధ్రప్రదేశ్ జీవనాడి  అయిన పోలవరం ప్రాజెక్టు లో తప్పులు ఉన్నాయని ఆ తప్పులను వైసీపీ ప్రభుత్వం సరి చేయలేదని అందుకే రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నాము అంటూ వినూత్న  ఆలోచన చేసిన విషయం తెలిసిందే.అయితే రివర్స్ టెండరింగ్ పై  ప్రతిపక్ష టిడిపి ప్రభుత్వం అధికార వైసీపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వాన్ని రివర్స్ టెండరింగ్  పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు . అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్న దానిపై విమర్శలకు దిగుతుంది టీడీపీ . ఈ క్రమంలో టిడిపి విమర్శలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టిడిపి పై పలు విమర్శలు గుప్పించారు. 

 

 

 

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంతో డబ్బు ఆదా అవుతుందని... డబ్బు ఆదా అవ్వడం మంచి విషయమే కదా టిడిపి ఎందుకు అనవసర విమర్శలు చేస్తోంది అంటూ మంత్రి బుగ్గన కౌంటర్ ఇచ్చారు. అయితే పోలవరంలో మోసాలకు పాల్పడుతున్నరంటూ   టిడిపి అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని...  ఒకప్పుడు చంద్రబాబు గొప్ప సంస్థల అంటూ పొగిడిన వారికే  తాము ఇప్పుడూ ప్రాజెక్టులను ఒప్పందం చేసుకుంటున్నాం  అంటూ మంత్రి బుగ్గన తెలిపారు. ఒకప్పుడు చంద్రబాబు పొగిడిన  సంస్థలకే తాము ప్రాజెక్టును అప్పగించినప్పటికే కూడా చంద్రబాబు ఎందుకు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తక్కువ వ్యయంతో  ప్రాజెక్టు పూర్తి అవడం చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు అని అందుకే అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

 

 

 వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందని చంద్రబాబు అంటున్నారని  కానీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారేసరికి కేవలం  ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు 40 కోట్ల మేర ఉన్నాయని మంత్రి బుగ్గన తెలిపారు. ఇక ఇసుక విషయంలో కూడా చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడడానికి కారణం చంద్రబాబు ప్రభుత్వం అని... ఇప్పుడు మాత్రం ఇసుక కొరత  వైసీపీ ప్రభుత్వం వల్ల ఏర్పడినది అంటూ  అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి బుగ్గన విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది  చంద్రబాబేనని... కానీ ఇప్పుడు తక్కువ వ్యయంతోనే రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తుంటే ఆయన చూసి ఓర్వలేక పోతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: