ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 26 న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మె సైరన్  మోగించారు. అటు  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ ఎన్ని డెడ్లైన్లు పెట్టినప్పుటికీ  కూడా ఆర్టీసీ జేఏసీ  మాత్రం వెనక్కి తగ్గలేదు. కెసిఆర్ దిగివచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ మినహా మిగతా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన కూడా ఆర్టీసీ జేఏసీ  వెనక్కి తగ్గలేదు. తమ 26 న్యాయపరమైన డిమాండ్లలో  ఏ ఒక్కటి  కూడా వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తూ సమ్మెను ఉధృతం చేస్తు వచ్చింది. కానీ చివరికి 47 రోజుల తర్వాత  ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటే చాలు అంటూ సమ్మె విరమిస్తాం అంటూ  ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది . 

 

 

 

 కెసిఆర్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించలేదు... ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకున్న ఆర్టీసీ జేఏసీ  సమ్మె విరమించలేదు... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం డిమాండ్ మినహా మిగతా డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిన  ఆర్టీసీ జేఏసీ  సమ్మె విరమించలేదు... కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండానే ఆర్టీసీ జేఏసీ  సమ్మె విరమించింది . 47 రోజుల పాటు కొనసాగిన సమ్మె... చివరికి ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించుకోకుండానే సమ్మె విరమించింది  ఆర్టీసీ జేఏసీ.అసలు  ఆర్టీసీ జేఏసీ సమ్మె ఎందుకు మొదలు పెట్టింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం లేదా తమ ఉనికిని చాటుకోవడం కోసమా . తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అయితే తమ బతుకులు బాగుపడతాయని నమ్మి ఆర్టీసీ జేఏసీ నేతల మీద నమ్మకంతో కార్మికులందరూ ఆర్టీసీ సమ్మె వైపు అడుగులు వేశారు... ఓవైపు జీతాలు లేక కుటుంబ పోషణ భారం అయినప్పటికీ కూడా ఆర్టీసీ జేఏసీ నేతల మీద  నమ్మకంతో ఆర్టీసీ సమ్మె కొనసాగించారు.

 

 

 

 కానీ చివరికి ఆర్టీసీ కార్మికుల ఆశలు  నీరుగారుస్తూ  ఆర్టీసీ జేఏసీ ఒక్క డిమాండ్  కూడా పరిష్కారం కాకుండానే సమ్మె విరమించింది .ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకుండానే సమ్మె విరమించేందుకా  ఆర్టీసీ సమ్మె  మొదలుపెట్టింది అంటూ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి . ఒక డిమాండ్ కూడా  పరిష్కారం కాకుండా ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకోవడం సమ్మె మొదలు పెట్టింది . ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో ఆర్టీసీ జేఏసీ సాధించింది ఏంటి... ఆర్టీసీ కార్మికుల ఆత్మబలిదానాలా...  ఆర్టీసీ కార్మికుల కుటుంబాల మనోవేదనా... అసలు ఆర్టీసీ జేఏసీ  ఏం సాధించింది అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా  పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: