ఒక నిర్ణయం జీవితాన్ని మారుస్తుందంటారు. అదే ఒక నిర్ణయం ప్రపంచాన్ని శాసిస్తుందంటారు. కాని ఒకే ఒక్క నిర్ణయం తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్తునే మార్చేసింది. కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇకపోతే అక్టోబర్ 4 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

 

 

కార్మికులు అకస్మాత్తుగా సమ్మెకు దిగడంతో దసరా పండుగతో పాటు దీపావళీ కలెక్షన్లలో భారీగా నష్టం వాటిల్లింది. అసలే సంవత్సరం పాటు కాస్తోకూస్తో నడిచే ఆర్టీసీకి దసరా పండగా భారీ వసూళ్లనూ సమకూర్చుతుంది. అలాంటి సమయంలో సమ్మెకు దిగడం ఒకరకంగా దారుణం. ఇటువంటి సమయంలో సమయస్పూర్తితో వ్యవహరించవలసిన ప్రభుత్వం ఈ విషయాన్ని కాస్త తేలికగానే తీసుకుంది. దాని పర్యావసనం ఈ రోజు ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్దకంగా మారింది.

 

 

ఇక ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసిన, దాని ఫలితం మిశ్రమంగా వచ్చింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో పడరాని పాట్లు పడుతూ లేనిపోని ప్రమాదాలను సృష్టించింది. అంతే కాకుండా దోచుకున్న వారికి దోచుకున్న చందాలా ప్రైవేట్ కండక్టర్లు ప్రయాణికుల నుండి అందినకాడికి దండుకున్నారు. ఇక హైకోర్టు ఆర్టీసీ సమ్మెను లేబర్ కోర్టుకు బదిలీ చేయడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణకు సిద్ధమైనట్లు ప్రకటించింది.

 

 

ఈ మాత్రం దానికే సమ్మె ఎందుకు చేసినట్లూ? అంతమంది ప్రాణాలు ఎందుకు తీసుకు తీసినట్లు? ఇప్పుడు ఏం సాధించారని సమ్మెను ముగించారు. ఇన్నిరోజులుగా ఓపూట తినీ తినక పస్తూలున్న పేద కార్మికులకు కార్మిక సంఘాలు ఏమేరకు న్యాయం చేసాయో ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదంటున్నారు మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు.

 

 

ఇన్ని రోజుల సమ్మెతో కార్మికులు సాధించింది ఏమిటో తెలియదు కాని, కార్మిక నేతలు ఎలాంటి ఫలితాన్ని ఆశించి ఈ సమ్మెకు శ్రీకారం చుట్టారో కనీసం వారికైన అర్దమైతే చాలు ఎందుకంటే ఈ ఉద్యమంలో మరణించిన వారి ఆత్మలకు న్యాయం జరుగక పోయినా కనీసం శాంతైనా కలుగుతుంది.

 

 

ఇకపోతే ఆర్టీసీ అధికారులతో ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ భేటీ అయ్యారు. కార్మికులు సమ్మె విరమిస్తే.. ఏం చేయాలనే దానిపై అధికారులతో చర్చించారు. అలాగే కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు పెట్టాలి, భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా ఏం చేయాలనేదానిపై చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఇదివరకు ఉన్నంతంగా ఆర్టీసీ వ్యవస్దలో కార్మికుల బలం ఇకముందు నుండి ఉండక పోవచ్చనే అనుమానాలు ఈ సందర్భంగా పుట్టుకొస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: