వివిధ మంత్రిత్వ శాఖల సలహా సంఘాల్లో వైసిపి ఎంపిలను సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘాల్లో వివిధ పార్టీల ఎంపిలను సభ్యులుగా వేయటం మామూలే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఒకేసారి వైసిపికి చెందిన 21 మంది ఎంపిలు నియమితులయ్యారు. తాజా నియామకాలతో కేంద్రం ఎల్లోమీడియా పరువంతా తీసేసినట్లయింది.

 

మూడు రోజులుగా పనిగట్టుకుని ఎల్లోమీడియా వైసిపి పై బురదచల్లుతోంది. వైసిపి ఎంపిల్లో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు మాత్రమే సలహా సంఘాల్లో సభ్యులుగా ఉంటున్నారని మిగిలిన ఎంపిలు మండిపోతున్నారంటే కథనాలు వండి వారుస్తోంది. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి కొన్ని మంత్రిత్వ శాఖల సలహా సంఘాల్లో సభ్యులుగా ఉన్నమాట వాస్తవమే.

 

అయితే ప్రతిపార్టికి చెందిన ఎంపిని కేంద్రప్రభుత్వం ఏదో ఓ మంత్రిత్వశాఖ సలహా సంఘంలో సభ్యునిగా నియమిస్తుంది. ఏ పార్టీ ఎంపిని ఏ సలహా సంఘంలో కమిటి సభ్యునిగా నియమించాలన్నది పూర్తిగా కేంద్రప్రభుత్వ ఇష్టమే. ఇందులో ఆయా పార్టీల అధినేతలకు ఎటువంటి సంబంధమూ లేదు. ఈ విషయం తెలిసి కూడా ఎంపిలకు, జగన్ కు మధ్య చిచ్చు పెట్టాలని అదేపనిగా బురద చల్లుతోంది.

 

తమకన్నా వయస్సులోను, అనుభవంలోను చిన్నవాడైన మిధున్ డైరెక్షన్లో తాము పనిచేయటమేంటి ? అని చాలామంది ఎంపిలు మండిపోతున్నారని కథనంలో సొల్లు రాశారు. నిజానికి వైసిపి నుండి గెలిచిన 22 మంది ఎంపిల్లో 17 మంది మొదటిసారి ఎంపిలైన వారే. వారిలో చాలామంది రాజకీయాలకే కొత్త. ఇక మిధున్ కన్నా ఎందులో అనుభవజ్ఞులు ? మిధున్ రెండోసారి వరుసగా ఎంపిగా గెలిచిన విషయం ఎల్లోమీడియా మరచిపోయింది.

 

సరే ఎల్లోమీడియాలో కథనాలు ఎలాగున్నా కేంద్రమైతే మొత్తం 22 మందిని వివిధ మంత్రిత్వశాఖల్లో సలహా కమిటి సభ్యులుగా నియమించటంపై ఎల్లోమీడియా ఏం చెబుతుంది ?  అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎల్లోమీడియా రాసిందంతే ఉత్త సొల్లే అని తేలిపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: