ఆర్టీసి  48 రోజుల నిరవధిక సమ్మె తర్వాత ఆర్టీసీ యూనియన్ల జేఏసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి పూర్తిగా ఇరుక్కుపోయారు. సమ్మె మొదలైన రోజుల్లో రెడ్డికి హీరో వర్షిప్ వచ్చినప్పటికీ చివరకు ఇపుడు జీరో అయిపోయారు. సమ్మె విరమిస్తున్నట్లు రెడ్డి ప్రకటన చేసిన తర్వాత పరిస్ధితి ఏమిటో తెలుసా ? అశత్థామపై ఇటు కార్మికులు మండిపోతున్నారు. అటు కేసియార్ కూడా లెక్క చేయటం లేదు.

 

నిజానికి ఏ యూనియన్ అయినా సమ్మెకు దిగేముందే తమ డిమాండ్లు పరిష్కారమయ్యే అవకాశాలు ఎంతున్నాయి ? సమ్మె చేస్తే సక్సెస్ రేటెంత ? అన్న విషయాలను భేరీజు వేసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటాయి. అయితే ఇక్కడ అశ్వత్ధామ మాత్రం ఏమి లెక్కలు వేసుకున్నారో తెలీదు కానీ చివరాఖరుకు ఫెయిలయ్యారనే చెప్పాలి.

 

యూనియన్ లీడర్ గా తాను ఫెయిల్ అవ్వటమే కాకుండా తననే నమ్ముకున్న మొత్తం 48వేలమంది సిబ్బందితో పాటు  ఆర్టీసి సంస్ధను కూడా సంక్షోభంలోకి నెట్టేశారు.  ఎప్పుడైతే నివరధిక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారో వెంటనే కార్మికులు, ఉద్యోగుల్లో రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత మొదలైపోయింది.

 

48 రోజులు సమ్మె చేసి సాధించిందేమిటో చెప్పాలని నిలదీస్తున్నారట. సమ్మె వల్ల రెండున్నర నెలల జీతాలు పోవటంతో పాటు సుమారు 24 మంది సహచరులను కూడా కోల్పోవాల్సొచ్చిందంటూ కార్మికులు ఫుల్లుగా ఫైర్ అవుతున్నారట.  చివరకు సమ్మె ఫెయిల్యూర్ అయ్యిందంటే అది లీడర్ గా రెడ్డి ఫెయిల్యూర్ అనే తేల్చేశారట.

 

అదే సమయంలో కేసియార్ కూడా రెడ్డిపై మండిపోతున్నారు. విలీనంతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారం సాధ్యం కాదని చెప్పిన తనను రెడ్డి బహిరంగంగా సవాలు చేయటమే కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని కేసియార్ సహించలేకపోతున్నారు. అనాలోచిత సమ్మె వల్ల సంస్ధ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినట్లు మొదటి నుండి చెబుతున్నదే.

 

48 రోజుల సమ్మె వల్ల ఆక్యుపెన్సీ రేషియో పడిపోవటమే కాకుండా సుమారు రూ. 300 కోట్లు నష్టపోయిందని సమాచారం. అందుకనే భవిష్యత్తులో ఆర్టీసిలో ఇక యూనియన్ అన్నదే లేకుండా చేయాలని కేసియార్ డిసైడ్ అయ్యారట. మరి ఏమవుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: