టీడీపీ అధికారంలోకి రావడానికి అండగా నిలబడే జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఈ జిల్లాలో పార్టీ మెజారిటీ సీట్లే సాధిస్తుంది. అలా అని ఓడిపోయినా, తక్కువ సీట్లు సాధించినా జిల్లాలో మాత్రం టీడీపీకి బలమైన నాయకత్వం, కేడర్ ఉంది. కానీ ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి పరిస్తితి మారిపోయింది. ఓటమి తర్వాత నేతలు ఎక్కువ శాతం సైలెంట్ అయిపోయారు. దానికి తోడు బడా నేతలు పార్టీని వీడిపోతున్నారు.

 

ఇటీవల తెలుగుయువత అధ్యక్షుడు దేవేనేని అవినాష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు టీడీపీకు గుడ్ బై చెప్పేసి వైసీపీ వైపు వెళ్ళిపోయారు. అయితే వీరి లైన్ లోనే మరికొందరు కూడా పార్టీని వీడతారనే వార్తలు టీడీపీని కలవరపడుతున్నాయి. అలాగే వంశీ మరొక టీడీపీ నేతని వైసీపీలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. మొన్నటివరకు వంశీతో సాన్నిహిత్యంగా ఉన్న పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా టీడీపీని వీడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 

2014లో పెనమలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బోడే...మొన్న ఎన్నికల్లో పార్థసారథి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన బోడే...మొన్న వంశీ ఎపిసోడ్ తర్వాత తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కు బోడే డబ్బులు ఇచ్చారని వంశీ ఆరోపణలు చేయడంతో, వాటికి వివరణ ఇవ్వడానికి బయటకొచ్చారు. అయితే ఆయన వంశీ తనకు స్నేహితుడే అని, కాకపోతే తాను డబ్బులు ఇవ్వలేదని మాట్లాడారు. కానీ కృష్ణా జిల్లా నేతలు వంశీని విమర్శించిన బోడే మాత్రం పెద్దగా విమర్శించలేదు.

 

అయితే ఇక్కడ వంశీ... టీడీపీలో భవిష్యత్తు ఉండదని బోడేని వైసీపీలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు బోడే కూడా తనకు వంశీ మినహాయిస్తే టీడీపీలో అండగా నిలిచే వారు లేరని, వంశీ పార్టీని వీడాక పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారిపోయాయని, కాబట్టి టీడీపీని వీడితేనే బెటర్ అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి బోడే టీడీపీకి ఎప్పుడు షాక్ ఇస్తారో?  

మరింత సమాచారం తెలుసుకోండి: