ఏపీలో బలపడాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ఎన్నికల్లో నోటా కంటే  తక్కువ ఓట్లు వచ్చిన కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఎక్కడ ఆగడం లేదు. ఎలా అయిన వచ్చే ఎన్నికల్లోపు బలపడిపోవాలని టీడీపీ నేతలని తెగ లాగేసుకున్నారు. ఇప్పటికే చాలామంది నేతలని తీసుకున్నారు. అయితే అధికారంలో ఉన్న జగన్ ఎప్పుడైతే గేట్లు తెరిచారో అప్పటి నుంచి బీజేపీలోకి వలసలు తగ్గాయి. వైసీపీలోకి వలసలు పెరిగాయి. ఈ క్రమంలోనే బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేల మీద కన్నేసింది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావులాంటి వారితో చర్చలు జరిపింది. వారు కూడా బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

 

ఇదే సమయంలో మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ వైసీపీ వైపు వచ్చేశారు. ఇక్కడవరకు వైసీపీ, బీజేపీలు టీడీపీని వీక్ చేయాలనే ప్లాన్ బాగానే అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓ అడుగు ముందుకేసి వైసీపీ ఎంపీలు కూడా బీజేపీలోకి రానున్నారని మాట్లాడారు. చాలామంది తమకు టచ్ లో ఉన్నారని అన్నారు. అయితే ఇక్కడ టీడీపీ ఏదో వీక్ ఉంది కాబట్టి అక్కడ నేతలు బీజేపీ లోకి వస్తున్నారు. కేంద్ర పార్టీ కాబట్టి కొంచెం అండగా ఉంటుందని అనుకుంటున్నారు.

 

కానీ అధికారంలో ఉన్న వైసీపీ నుంచి ఎంపీలు ఎలా వస్తారని వీర్రాజు మాట్లాడారో అర్ధం కావడం లేదు. జగన్ అంతవరకు రానిస్తారా? అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఇప్పుడు ఏపీ ఎంపీలు వైసీపీలో ఉంటేనే బెటర్ బీజేపీలోకి వెళితే మరిన్ని సమస్యలు వస్తాయి. ఇప్పటికే విభజన హామీలు అమలు చేయలేదని ప్రజలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. పైగా వైసీపీలో ఉంటేనే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశముంటుంది. బీజేపీలోకి వెళితే ఏం ఉపయోగం ఉండదు. అటు జగన్ కూడా బీజేపీలోకి వెళ్ళే అంతా సీన్ ఇవ్వరు. ఇవ‌న్నీ బీజేపీ ప‌గ‌టి క‌ల‌లే అనుకోవాలి. ఏదేమైనా సోము వీర్రాజు ఏదో మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్ప..ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: