రాజకీయాల్లో చంద్రబాబు కంటే జూనియర్ అయిన ప్రజల నాడి పట్టుకోవడంలో మాత్రం జగన్ సీనియర్ అయిపోయారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని తెలుసుకుని, వారికి ఏం కావాలో అవే హామీలు ఇచ్చి, ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తూ ప్రజల మన్ననలని పొందుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఉద్దేశంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జి‌ఓ జారీ చేశారు.

 

ఇక దీనిపై ప్రతిపక్షాలు తెగ రాద్ధాంతం చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు తెలుగుని చంపేస్తున్నారని ఓ ఫైర్ అయిపోతున్నారు. అయితే జగన్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వీరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అలాగే కొన్ని విధానాలపై పోరాటాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇసుక లాంటి అంశాలపై. ఇలాంటి వాటిపై అధికార పక్షం కూడా పెద్దగా ఎదురుదాడి చేయలేకపోయింది. ఎందుకంటే ఇసుకపై సమస్య నిజం కాబట్టి. అందుకే ప్రజలు కూడా ప్రతిపక్షాల పోరాటాలకు మద్ధతు తెలిపారు.

 

కానీ ఇంగ్లీష్ మీడియం విషయంలో మాత్రం ప్రజలు పూర్తిగా జగన్ వైపే ఉన్నారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే అసహ్యించుకుంటున్నారు. అటు అధికార పక్షం కూడా ఆ రెండు పార్టీలపై గట్టిగా ఎదురుదాడి చేస్తున్నాయి. ఈ నిర్ణయానికి మద్ధతు తెలిపేవరకు వారిని వూర్లల్లో కూడా తిరగనివ్వద్దని జగన్ తో సహ ఆ పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు. దీంతో టీడీపీ,జనసేన సహ పలు ప్రతిపక్షాలు దీనిపై వెనక్కి తగ్గాయి. ఇంగ్లీష్ మీడియం అమలు చూస్తూనే తెలుగు కూడా అమలు చేయాలని కోరుతున్నారు. కానీ జగన్ మాత్రం ఇంగ్లీష్ మీడియం పెట్టేసి తెలుగు ఒక సబ్జెక్ట్ ని తప్పనిసరి చేశారు. మొత్తానికైతే జగన్ దెబ్బకు టీడీపీ, జనసేనలు వెనక్కి తగ్గాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: