ఏపీలో తెలుగుదేశం పేరుకు మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎన్నికల్లో 23 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇప్పటికే నేతలు వరుసగా ఆ పార్టీని వీడారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా పార్టీని మారిపోవడానికి సిద్ధమవుతున్నారు. అందులో వల్లభనేని వంశీ ఆల్రెడీ పార్టీని వీడారు. ఇక గంటా శ్రీనివాసరావు లాంటి వారు కూడా బీజేపీలో చేరేందుకు చూస్తున్నారు. అలాగే ఇంకొంతమంది కూడా టీడీపీని వీడే అవకాశముంది. అయితే 17 మంది కంటే టీడీపీ సంఖ్య తగ్గితే ప్రతిపక్ష హోదా పోతుంది.

 

కాకపోతే అధికారికంగా టీడీపీకి ప్రతిపక్ష పోవడానికి సిద్ధంగా ఉన్న...అనధికారికంగా మాత్రం ఎప్పుడో పోయినట్లుంది. ఆ పాత్రని జనసేన పోషిస్తున్నట్లు కనబడుతుంది. టీడీపీ కంటే జనసేననే వైసీపీ ప్రభుత్వంపై స్ట్రాంగ్ గా పోరాడుతుంది. పవన్ కల్యాణ్ ప్రతి అంశంలోనూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉండటానికి ఒక్క ఎమ్మెల్యే ఉన్న ప్రజల్లో మాత్రం పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రజల నుంచి స్పందన కూడా చంద్రబాబు కంటే పవన్ కే ఎక్కువ వస్తుంది. అయితే ప్రతిపక్షంలో పోరాడటానికి చంద్రబాబుకు ఆ పార్టీ నేతల నుంచి మద్ధతు కరువైంది. ఓ వైపు కేసులు, మరోవైపు నేతల పార్టీ మార్పుతో టీడీపీ కష్టాల్లో కొట్టమిట్టాడుతుంది.

 

బాబు వాటిని సరిచేసుకోవడానికే ఎక్కువ సమయం సరిపోతుంది గానీ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడే సమయం దొరకడం లేదు. అలాగే బాబు పోరాటాలకు బయట స్పందన కూడా తక్కువ ఉంది. అదే సమయంలో పవన్ పోరాటానికి మంచి స్పందన వస్తుంది. అందుకే రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తామే అసలు సిసలైన ప్రతిపక్షం అని నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. మొత్తానికి జనసేన..టీడీపీ ప్రతిపక్ష పాత్రని లాగేసుకున్నట్లుంది. మ‌రి 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే బాబోరు ఏం చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: